వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తవ్వే కొద్దీ విశాఖపట్నం మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు అరెస్టు చేశారు. అతను ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు ఎసిబి గుర్తించింది. అయితే, ఆస్తుల విలువను ఇంకా పూర్తిగా మదింపు చేయాల్సి ఉందని ఎసిబి అధికారులు అంటున్నారు.

ఆనంద్ కుమార్ ఆస్తులకు సంబంధించిన వరుసగా నాలుగో రోజు శుక్రవారం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంక్ లాకర్లను తెరిచారు. లాకర్లలో వెండి, బంగారం ఉన్నట్లు తేలింది. కొన్ని పత్రాలను కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ కుమార్‌కు ఉన్న సంబంధాలపై, బినామీ ఆస్తులపై కూడా ఎసిబి అధికారులు దృష్టి పెట్టారు.

 అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

ఆనంద్ కుమార్ ఇల్లు చూస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. సెల్లార్‌ నుంచి టెర్రస్‌ వరకూ ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

 అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

బయోమెట్రిక్‌ ద్వారా పనిచేసే అత్యాధునిక లిఫ్టు, ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసుకునేందుకు మినీ థియేటర్‌, మినీ బార్‌, బాతరూమ్‌లో స్టీమ్‌బాత్‌, స్విమ్మింగ్‌పూల్‌లో స్నానం చేస్తున్న అనుభూతి పొందేలా టబ్బు ఇలా అత్యాధానికిమైన హంగులు ఏర్పాటు చేసుకున్నాడు.

 అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

కుటుంబ సభ్యులకు ఒక ఫ్లోర్‌, బంధువులు వస్తే ఉండేందుకు మరో అంతస్తు. అతిథులకు ఇంకో అంతస్తు ఇలా కట్టుకున్నాడు.

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

ప్రతి ఫ్లోర్‌లోనూ అత్యంత ఖరీదైన ఫర్నీచర్‌, భారీ తెరల స్మార్ట్‌ టీవీ కూడా ఉన్నాయి. నాలుగంతస్థుల డూప్లెక్స్ హౌస్‌ను చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

 అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

ఆత్మరక్షణకు, అవసరమైతే బెదిరించేందుకు వీలుగా 9 ఎంఎం రివాల్వర్‌ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. 40 రౌండ్ల బుల్లెట్లు కూడా లభించాయి. రివాల్వర్‌ లైసెన్సు గడువు 2015 అక్టోబర్‌లోనే ముగిసినట్లు సమాచారం.

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారనే అభియోగంపై ఆనంద కుమార్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

ఏసీబీ అధికారుల రాకను ముందే పసిగట్టిన ఆనంద కుమార్‌ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి తాళం వేసుకుని కుటుంబంతో సహా పరారయ్యాడు.

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అధికారులు ఇంటిని సీజ్‌ చేసి, ఆయన పనిచేస్తున్న కార్యాలయంతోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి సుమారు రూ.1.33 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

అక్రమాస్తుల విలువ రూ. 25 కోట్లు: ఆనంద్ కుమార్ అరెస్టు

వీటి మార్కెట్‌ విలువ సుమారు పది కోట్ల రూపాయలు వుంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆనంద్‌ బుధవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయాడు. గురువారం ఉదయాన్నే అతడి సమక్షంలోనే లాసన్స్‌బే కాలనీలోని ఇంట్లో సోదాలు నిర్వహించారు.

English summary
About Rs 25 crores value illegal assets have been found with Visakhapatnam Madhurawada sub registrar Anand Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X