వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కొత్త ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ వి.కనగరాజ్ నియామకం

|
Google Oneindia TeluguNews

అమరావతి: శుక్రవారం రోజున ఏపీలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఫోకస్ ఒక్కసారిగా పాలిటిక్స్ వైపు మరలింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారిగా రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం, అందుకు గవర్నర్ ఆమోదం తెలపడం, ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

Recommended Video

Justice Kanagaraj Appointed As New State Election Commissioner Of Andhra Pradesh

అనంతరం ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికల సంఘంలో కార్యదర్శిగా ఉన్న రామసుందర్ రెడ్డి నియమితులయ్యే అవకాశం ఉండటం అనే వార్త బయటకు రావడం జరిగిపోయాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్షాలు రంగంలోకి దిగి జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించాయి. ఇక మార్పులు చేసిన ప్రకారమే హైకోర్టు రిటైర్డ్ జడ్జినే ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉంటారని చెప్పిన ప్రభుత్వం ఆమేరకు కసరత్తు చేసింది.

 Madras high court Retired Justice V. KanagaRaj appointed as AP new State Election commissioner

రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు జస్టిస్ వి.కనగరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్‌ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వి.కనగరాజ్ పనిచేశారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధిచి కీలక తీర్పులు ఇచ్చారు జస్టిస్ వి. కనగరాజ్. మద్రాస్ లా కాలేజీలో 1972 లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జస్టిస్ కనగరాజ్.. 1973లో మద్రాస్ బార్ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 1997 ఫిబ్రవరి 24న మద్రాస్ హైకోర్టు జడ్జిగా కనగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో 69వేల కేసుల్లో తీర్పు ఇచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా యూనివర్శిటీకి సెనేట్‌గా కూడా సేవలందించారు. ఇక మూడేళ్ల పాటు జస్టిస్ కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవిలో కొనసాగనున్నారు. అవసరమైతే మరో మూడేళ్లు పొడగించేలా చట్టంలో మార్పులు చేసింది ప్రభుత్వం.

 Madras high court Retired Justice V. KanagaRaj appointed as AP new State Election commissioner
English summary
AP government completed the process of removing the state election officer Nimmagadda Ramesh Kumar by bringing an ordinance and Governor giving an assent to it. Govt had appointed Retired Madras highcourt justice V. Kanagaraj as the new State Election commissioner. As per the GO issued a Three member committee will be formed in the state election commission. With this the long time battle between the SEO, and AP govt turns out to be more intense.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X