• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్‌పై మాగంటి సంచలనం, పయ్యావులా! వాళ్లు మగాళ్లు కాదా: రోజా

By Srinivas
|

ఢిల్లీ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి బాబు గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తాను వైయస్ అవినీతికి సహకరించనందునే తనను వైయస్ మంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి ప్రతిపక్ష నేత దేశంలోనే ఎక్కడా లేడన్నారు. భూములు కొన్న తర్వాత సహజంగానే వాటి ధరలు పెరుగుతాయని మాగంటి బాబు చెప్పారు.

అంతకుముందు ఎంపీ మురళీ మోహన్ కూడా జగన్ పత్రిక సాక్షి పైన తీవ్రంగా మండిపడ్డారు. సాక్షి పేపర్లో ఎదుటి మనిషి పైన ఎలాంటి రాళ్లు వేయాలనే ఆలోచిస్తున్నారని, గురివింద గింజకు కింద నలుపు ఉన్నట్లు తెలియదని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Maganti hot comments on Late YS Rajasekhar Reddy

జగన్ పైన అక్రమ కేసులు ఉన్నాయో, వైయస్ హయాంలో రూ.లక్ష కోట్లు దోచుకున్నారో లేదో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. జైల్లో ఉండి వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే అన్నారు. తమపై సాక్షి పత్రికలో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు.

జగన్ ఒక్కరే మిగులుతారు: పల్లె

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చివరకు మిగిలేది ఆ పార్టీ అధ్యక్షుల వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక తమ పైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

వారు మగాళ్లు కాదా?: రోజా, అంబటి

తాను తన కొడుకు పేరిట మగాడిలా కొన్నానని టిడిపి నేత పయ్యావుల కేశవ్ చెబుతున్నారని, అయితే బినామీ పేర్లతో కొన్న సుజనా చౌదరి, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబులు మగాళ్లు కాదా అని అంబటి రాంబాబు, రోజా ప్రశ్నించారు.

రోజా ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ... అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారని, ఇప్పుడు అవినీతి కట్టడంలో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమ కట్టడం అన్నారు. బాలకృష్ణ వియ్యంకుడు కూడా కొన్నారన్నారు.

చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రెండువేల కోట్లు కలిగిన హెరిటేజ్ ఎలా సంపాదించారన్నారు. పాలు కొన్ని చంద్రబాబు హెరిటేజ్ వేలకోట్లు సంపాదించిందని కానీ పాలు పోసిన వారు మాత్రం సంపాదించలేకపోయారన్నారు. అలాగే కూరగాయలు కొన్న హెరిటేజ్ వేల కోట్లు సంపాదించిందని, కూరగాయలు అమ్మేవారు మాత్రం సంపాదించలేదన్నారు.

జగన్‌కు సవాల్ విసిరే అర్హత కూడా పయ్యావులకు లేదన్నారు. ఆయనకు తమ పార్టీ కార్యకర్తలు కూడా సమాధానం చెబుతారన్నారు. అంబటి మాట్లాడుతూ.. తన వార్త రాకుండా పయ్యావుల కేశవ్ మొదట కాళ్ల బేరానికి వచ్చారని, బయట మాత్రం రంకెలు వేస్తున్నారన్నారు. సాక్షి కథనాలతో చంద్రబాబుకు, లోకేష్‌కు నిద్ర పట్టడం లేదన్నారు.

English summary
TDP MP Maganti Babu hot comments on Late YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X