నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాగుంట చూపు వైసిపి వైపు..! త‌న వ‌ర్గంతో ప్ర‌త్యేక స‌మావేశం : సీయంఓ నుండి కాల్..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌కాశం జిల్లాలో మరో కీల‌క నేత టిడిపిని వీడుతున్నారా..ఇదే చ‌ర్చ ఇప్పుడు టిడిపిలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ టిడిపిని కాద‌ని వైసిపి లో చేరారు. ముఖ్య‌మంత్రి స్వ‌యంగా హామీ ఇచ్చినా ఆమంచి స‌సేమిరా అన్నారు. ఇదే స‌మ‌యంలో మాజీ ఎంపి, ప్ర‌స్తుత ఎమ్మల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి త‌న వ‌ర్గీయుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. ఆయ‌న వైసిపి వైపు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ స‌మావేశం జ‌రుగుతు న్న స‌మ‌యంలోనే ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుండి ఆయ‌న‌కు కాల్ వ‌చ్చింది. సీయంతో సమావేశం కావాల‌ని వారు సూచించిన‌ట్లు తెలుస్తోంది.

మాతోనే మొద‌లు..వైసిపి లోకి ఇక క్యూ: అవినీతి కార‌ణంగానే మోదీ సీరియ‌స్ : వైసిపి లో చేరిన అవంతిమాతోనే మొద‌లు..వైసిపి లోకి ఇక క్యూ: అవినీతి కార‌ణంగానే మోదీ సీరియ‌స్ : వైసిపి లో చేరిన అవంతి

త‌న వ‌ర్గంతో ప్ర‌త్యేక స‌మావేశం..

త‌న వ‌ర్గంతో ప్ర‌త్యేక స‌మావేశం..

మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గ‌తంలో కాంగ్రెస్ నుండి ఎంపీగా గెలిచిన మాగుంట 2014 ఎన్నిక ల ముందు టిడిపిలో చేరారు. 2014 ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్దిగా ఒంగోలు నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత మాగుంట కు టిడిపిలో ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఆయ‌న టిడిపిలో సంతృప్తిగా లేర‌ని..ఆయ‌న పార్టీని వీడుతార‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న తిరిగి ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తాన‌ని చెబుతూ వ‌స్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఆయ‌న తాజాగా నెల్లూరు లో ప్ర‌కాశం జిల్లాలోని త‌న వ‌ర్గం తో ప్ర‌త్యేకంగా సమావేశం అయ్యారు. ఆ సంద‌ర్భంగా ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలోని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి.. ప్ర‌జ‌ల మూడ్ తెలుసుకొనే ప్ర‌య‌త్నం చేసారు. ఆ సంద‌ర్బం లో కొంద‌రు పార్టీ మార్పు పైనా ప్ర‌తిపాదించిన‌ట్లుగా విశ్వ‌స నీయ స‌మాచారం.

వైసిపి వైపు వెళ్తారా..

వైసిపి వైపు వెళ్తారా..

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఒంగోలు నుండి ఎలాగైనా గెల‌వాల‌నే ల‌క్ష్యంతో ఉన్నారు. ఇది త‌న‌కు త‌న కుటుం బానికి చాలా అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే ఏ పార్టీ నుండి పోటీ చేస్తే గెలుస్తా మ‌నే అంశం పై లోతుగా అధ్య‌య‌నం చేస్తున్నారు. ఇప్ప‌టికే వైసిపి లో ఒంగోలు ఎంపీగా గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసిన సుబ్బారెడ్డికి ఈ సారి ఎన్నిక‌ల్లో పోటీ చేయించ‌కుండా..ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ కోసం వినియోగంచుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో..అక్క‌డ వైసిపికి అభ్య‌ర్ది అవ‌స‌రం. ఇదే స‌మ‌యంలో మాగుంట సైతం వైసిపి వైపే ఆస‌క్తి గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న తో వైసిపి ముఖ్య నేత‌లు ట‌చ్ లో ఉన్న‌ట్లుగా స‌మాచారం. అయితే, త్వ‌ర‌లో ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో..త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఒత్తిడి పెరుగుతోంది.

17న మాగుంట కీల‌క నిర్ణ‌యం..

17న మాగుంట కీల‌క నిర్ణ‌యం..

ప్ర‌స్తుతం నెల్లూరు లో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 17న ఒంగోలు రానున్నారు. 17, 18 తేదీల్లో ఒంగోలు లో త‌న వ‌ర్గం తో మ‌రో సారి స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించారు. ఆ సంద‌ర్భంగా తాను పార్టీ మారే అంశం పై చ‌ర్చించి ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం. అయితే, త‌న వ‌ర్గంతో మాగుంట ప్ర‌త్యేకంగా స‌మాశ‌మైన స‌మ‌యంలోనే ఆ స‌మావేశం గురించి తెలుసుకున్న ముఖ్య‌మంత్రి కార్యాల‌యం మాగుంట కు ఫోన్ చేసింది. రాజ‌కీయంగా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌ద్ద‌ని..వ‌చ్చి ఒక సారి సీయంతో సమావేశం కావాల‌ని సూచించిన‌ట్లు సమాచారం. అయితే, మాగుంట మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్ట‌టం లేదు. ఈ నెల 17న ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకుంటా ర‌ని తెలుస్తోంది.

English summary
EX MP and sitting MLC Magunta Srinivasulu reddy may leave TDP and join in YCP. He met with his followers in Nellore do discuss about party change for up coming elections. He may take decision 17th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X