వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిఎన్జీవోల భాములపై అధికారులే చూసుకుంటారు: అలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mahamood ali says officers will look into the APNGOs lands
హైదరాబాద్: ఎపి ఎన్జీవోలకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలనే తమ ప్రభుత్వ నిర్ణయాన్ని అధికారులే చూసుకుంటారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. అన్నీ చట్ట ప్రకారమే జరుగుతున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని భూములను ఈ నెల 7వ తేదీన పరిశీలిస్తానని ఆయన చెప్పారు. భూకబ్జాదారులను వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. భూముల సర్వే కోసం 600 కోట్ల రూపాయలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ శాఖలోని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు.

ఇప్పటి వరకు 72 సర్వేయర్, 201 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను గుర్తించినట్లు ఆయన తెలిపారు. అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని ఆయన చెప్పారు. కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

వచ్చే మూడేళ్లలో అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అసైన్డ్ భూములకు సంబంధించి పూర్తి సమాచారం అందించాలని ఆయన అధికారులను కోరారు.

English summary
Telangana deputy CM Mahamood Ali said that officers will look into the lands of APNGOs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X