వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌హానాడు..ఓ మ‌ధుర స్ర్ముతుల స‌మాహారం..

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న మ‌హానాడు చివ‌రి రోజున కార్య‌కర్త‌లు మ‌ధురానుభూతుల‌కు లోన‌య్యారు. మూడు రోజులు నాయ‌కుల‌తో , స‌హ‌చ‌రుల‌తో సంద‌డి చేసిన శ్రేణులు మ‌హానాడు ఇచ్చిన మ‌ధుర జ్ఞాప‌కాల‌తో తిరుగు ప్ర‌యాణం అయ్యారు. వ‌చ్చే ఏడాది మ‌ళ్లీ క‌లుద్దాం అంటూ సెల‌వతీసుకుంటున్నారు కార్య‌క‌ర్త‌లు, అభిమానులు.

 తీపి జ్ఞాప‌కాల‌తో తిరుగు ప్ర‌యాణం...

తీపి జ్ఞాప‌కాల‌తో తిరుగు ప్ర‌యాణం...

మ‌హ‌నాడు అంటేనే టీడీపీ శ్రేణుల‌కు నూత‌నోత్తేజాన్ని ఇచ్చే పండ‌గ‌. మ‌హ‌నాడులో వాడివేడి రాజ‌కీయ ప్ర‌సంగాలే కాకుండా వ‌చ్చిన ప్ర‌తినిధుల‌కు సామాజిక భాద్య‌త‌ను గుర్తు చేసే ఏర్పాట్లు చేశారు నిర్వ‌హ‌కులు. అరుదుగా దోరికే చేనేత దుస్తుల‌తో పాటు అర‌కు ఘుమ‌ఘుమ‌ల కాఫీని వేడివేడిగా అందిస్తున్నారు. చేనేత వ‌స్త్రాల‌కు స్టాళ్ళు ఏర్పాటు చేసి చేయూత నిస్తూనే, గిరిజ‌న కాఫీకి కార్పోరేట్ బ్రాండింగ్ ను క్రియోట్ చేస్తున్నారు. ఉద‌యాన్నే సువాస‌న‌లు వెద‌జ‌ల్లే చిక్క‌టి కాఫీ తాగితే గానీ కొద‌రికి తెల్ల‌వారిన‌ట్టు కాదు. అదే అనుభ‌వాన్ని మ‌హానాడు ప్రాంగ‌ణంలో పొందుతున్నారు పార్టీ శ్రేణులు.

Recommended Video

Tdp Mahanadu 2018 : Nara Lokesh speech
హ‌స్త‌క‌ళ‌ల‌కు ప్ర‌భుత్వం త‌రుపున పూర్తి చేయూత‌..

హ‌స్త‌క‌ళ‌ల‌కు ప్ర‌భుత్వం త‌రుపున పూర్తి చేయూత‌..

అయితే మ‌హ‌నాడు ప్రాగంణంలో ఇలాంటి కాఫీ ప్రియులు పండ‌గ చేసుకుంటున్నారు. గిరిజ‌న కాఫీ స్టాల్ వ‌ద్దే క‌మ్మ‌టి కాఫీని ఆస్వాదిస్తూ క‌నిపిస్తున్నారు. బ్రాండెడ్ కాఫీల‌కంటే మంచి రుచి, వాస‌న, చిక్క‌ద‌నం గిరిజ‌న కాఫీలో ఉండ‌టం దీని ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకుంటున్నారు. ఇలాంటి గిరిజ‌న ఉత్ప‌త్తుల‌ను ప్ర‌భుత్వ స‌ద‌స్సుల‌తో పాటు మ‌హ‌నాడు లాంటి కార్య‌క్ర‌మాల్లో ప్ర‌మోట్ చేయ‌డం ఎంతో బావుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

మినీ మాల్ ను త‌ల‌పిస్తున్న మ‌హానాడు ప్రాంగ‌ణం..

మినీ మాల్ ను త‌ల‌పిస్తున్న మ‌హానాడు ప్రాంగ‌ణం..

ఇదిలా ఉంటే పెడ‌న అద్ద‌కం అందాలు చేనేత‌స్టాళ్ళ‌లో త‌ళుక్కు మంటుండంతో తెలుగు త‌మ్ముళ్ళు వీటిని కోనుగోలు చేస్తున్నారు. అటు మాడుగుల హ‌ల్వాలోని తియ్య‌ద‌నం ఓవైపు నోరూరిస్తుంటే., ఆత్రేయ‌పురం పూత‌రేకులు చూస్తుండ‌గానే నోట్లో క‌రిగిపోతూ రాష్ట్ర నలుమూల‌ల నుండి వ‌చ్చిన‌వారికి స‌రికొత్త రుచుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నాయి. ఓవైపు గిరిజ‌న, చేనేత‌, డ్వాక్రా ఉత్ప‌త్తుల‌ను ప‌మోట్ చేస్తున్న మ‌హ‌నాడులో ఈసారి పార్టీ మెటీరియ‌ల్ కూడా ప్ర‌త్యేకత‌ను చాటుకుంటుంది. తెలుగుదేశం చొక్కాలు, ఎన్టీఆర్ టీష‌ర్టులు, కీచెయిన్ లు, గొడుగులు మ‌హ‌నాడు ముగింపురోజు ఇళ్ళ‌కు వెళ్లే ప్ర‌తినిధుల‌కు తీపి గుర్తులుగా మిగిలిపోనున్నాయి.

వ‌చ్చే మ‌హానాడులో మళ్లీ క‌లుద్దాం త‌మ్ముళ్లూ అంటూ వీడ్కోలు....

వ‌చ్చే మ‌హానాడులో మళ్లీ క‌లుద్దాం త‌మ్ముళ్లూ అంటూ వీడ్కోలు....

కేవలం ప్ర‌త‌నిధుల‌కు స‌రికొత్త రుచులు, దుస్తులు ప‌రిచయం చేయ‌డంతో పాటు వారిలోని సామాజిక సృహ‌ను , సేవాభావాన్ని పెంపోదించే బ్ల‌డ్ బ్యాంకు లాంటి కార్య‌క్ర‌మాల‌కు కూడా విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ర‌క్త‌దానం చేసిన వారికి ప్ర‌సంశాప‌త్రాలు ఇవ్వ‌డంతో పాటు వారిని మ‌రింత‌గా ప్రోత్స‌హించేంద‌కు ఏర్పాట్టు చేస్తున్నారు. మూడురోజులు మ‌హ‌నాడు ముగుస్తున్నందుకు కార్య‌క‌ర్త‌ల్లో కోంత నిరాశ క‌నిపిస్తున్నా. ఈ మ‌హ‌నాడు మ‌ధుర స్మృతుల‌ను త‌మతో తీసుకువెళుతున్నామంటున్నారు పార్టీ శ్రేణులు.

English summary
telugudesham party mahanadu event comes to an end in amaravathi. party cadre felt an unique experience with this event. the shops which arranged in the premises attracted many people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X