వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ చలన చిత్ర అవార్డుల్లో మెరిసిన మహానటి..!! సౌండ్ మిక్సింగ్ లో రంగస్థలం, స్క్రీన్ ప్లేలో చి.ల.సౌ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు, తమిళ భాషల్లో వెండితెరపై ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించిన ఎవర్ గ్రీన్ నటి సావిత్రి. కళ్లతోనే నటించగల సత్తా ఉన్న సావిత్రిపై తీసిన బయోపిక్ మహానటి. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తీసిన ఈ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. వెండితెరపై మెరుపులు మెరిపించిన ఓ మహానటి తన జీవిత చరమాంకంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదనే పాయింట్ ప్రేక్షకులను మెప్పించింది. ఆర్థిక క్రమ శిక్షణ అనేది లేకపోతే- ఎవ్వరికైనా, ఎలాంటి వారికైనా గడ్డు రోజులు తప్పవని హెచ్చరించిన జీవితం సావిత్రిది.

<strong>నిన్న ఆజాద్..నేడు ఏచూరి, డీ రాజా: కాశ్మీర్ లో ప్రతిపక్షాన్ని అడుగు పెట్టనివ్వని కేంద్రం!</strong>నిన్న ఆజాద్..నేడు ఏచూరి, డీ రాజా: కాశ్మీర్ లో ప్రతిపక్షాన్ని అడుగు పెట్టనివ్వని కేంద్రం!

క్లిష్టమైన క్యారెక్టర్ లో జీవించిన కీర్తి..

క్లిష్టమైన క్యారెక్టర్ లో జీవించిన కీర్తి..

అలాంటి క్లిష్టమైన సావిత్రి పాత్రలో అచ్చు గుద్దినట్టు నటించిన మలయాళ కుట్టి కీర్తి సురేష్.. తాజాగా జాతీయ అవార్డుకు కొట్టేసింది. కేరీర్ ఆరంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు కోసం ఎంపికైంది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో జ్యూరీ సభ్యులు జాతీయ స్థాయి ఉత్తమ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. మహానటికి మొత్తం మూడు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కూడా ఈ మూవీ ఎంపికైంది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలోనూ అవార్డు సాధించింది. హిందీలో యూరి, తమిళంలో బారం, కన్నడంలో నాతిచరామి, మలయాళంలో సూడాని ఫ్రమ్ నైజీరియా ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా ఎంపికయ్యాయి. కన్నడ మూవీ కేజీఎఫ్ బెస్ట్ యాక్షన్ మూవీగా ఎంపికైంది.

నాని నిర్మించిన సినిమాకూ రెండు అవార్డులు..

నాని నిర్మించిన సినిమాకూ రెండు అవార్డులు..

నేచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ మీద వాల్ పోస్టర్ సినిమా కింద నిర్మించిన అ సినిమా రెండు జాతీయ అవార్డులను అందుకోబోతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీకి బెస్ట్ మేకప్, బెస్ట్ విజువల్స్ విభాగంలో అవార్డులు దక్కాయి. కాజల్, రెజినా కసండ్రా, అవసరాల శ్రీనివాస్ వంటి టాలీవుడ్ లో పేరున్న పలువురు నటీనటులు ఈ సినిమాలో కనిపిస్తారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కానప్పటికీ.. విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మూస ధోరణిలో సినిమాలను తెరకెక్కిస్తున్న పరిస్థితుల్లో నిఖార్సయిన డిఫరెంట్ సినిమాగా ఈ మూవీని ఆదరించారు ప్రేక్షకులు.

రామ్ చరణ్ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు

రామ్ చరణ్ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమా బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డుకు ఎంపికైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. గ్రామీణ వాతావరణానికి అద్దం పట్టింది. 1980 నాటి వాతావరణం నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు, పరస్పర దాడులు.. వంటి సామాజిక అంశం ఆధారంగా రూపొందింది. రామ్ చరణ్, సమంత డీ గ్లామర్ రోల్ లో నటించడం, సహజ నటనను ప్రదర్శించడం ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాకు బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు దక్కింది. గ్రామీణ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించడంలో దర్శకుడు సుకుమార్ గ్రాండ్ సక్సెస్ సాధించారు. గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తామూ సినిమాలను తీయగలమని ఆయన నిరూపించారు.

బెస్ట్ స్క్రీన్ ప్లే.. చి.ల.సౌ

బెస్ట్ స్క్రీన్ ప్లే.. చి.ల.సౌ

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో మరో తెలుగు సినిమా చి.ల.సౌకు అవార్డుకు ఎంపికైంది. వర్ధమాన నటుడు రాహుల్ రవీంద్రన్ మెగా ఫోన్ పట్టుకున్న మొదటి చిత్రం ఇది. అక్కినేని కుటుంబ వారసుడు సుశాంత్, హిందీ అమ్మాయి నటించిన ఈ సినిమాను అక్కినేని నాగార్జున, జస్వంత్‌ నాడిపల్లి, భరత్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకుంది. సుశాంత్ కేరీర్ లో మొట్టమొదటి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుందని విడుదల సమయంలోనే క్రిటిక్స్ నుంచి ప్రశంసలు పొందింది. తాజాగా వారి అంచనాలకు అనుగుణంగా స్క్రీన్ ప్లే విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

English summary
Mahanati, directed by Nag Ashwin, was also a commercially successful film that released in Tamil and Telugu simultaneously. Keerthy received appreciation from all the critics for her realistic and convincing performance in the movie. Mahanati is a biopic of Savitri, which depicts her rise and fall in cinema. The story travels from childhood to death of the legendary actress, who was a star in both Tamil and Telugu cinema. The film has also won the National Award for Best Telugu film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X