• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహారాష్ట్రలో దిశ చట్టం అమలు: సుచరితతో మహా హోం శాఖ మంత్రి, డీజీపీ భేటీ..!

|
  Evening News Express : 3 Minutes 10 Headlines | Coronavirus | YCP MLA Roja Slams Chandrababu

  అమరావతి: ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మంగా ప్రవేశ పెట్టిన ఏపీ దిశ చట్టం.. ఇక మహారాష్ట్రలోనూ అమలులోకి రానుంది. మూడు నెలల వ్యవధిలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే సర్కార్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా- ఈ చట్టంపై అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ గురువారం అమరావతికి చేరుకున్నారు. ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో భేటీ అయ్యారు.

  డీజీపీ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి..

  అనిల్ దేశ్‌ముఖ్ ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. హోం మంత్రి సుచరిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెంట మహారాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్, మహిళా. శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర అధికారులు ఉన్నారు.

   దిశ చట్టంపై ప్రశంసలు..

  దిశ చట్టంపై ప్రశంసలు..

  దిశ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు అనిల్ దేశ్‌ముఖ్ ప్రశంసలు కురిపించారు. మహిళలు, చిన్నపిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారిలో భయం కలిగించేలా 21 రోజుల్లోనే ఉరిశిక్షను విధించడానికి రూపొందించిన చట్టాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకే తాను ఏపీకి వచ్చానని అన్నారు.

  చట్టం అమలు తీరుపై ఆరా..

  చట్టం అమలు తీరుపై ఆరా..

  దిశ చట్టంలో పొందుపరిచిన అంశాలు, 21 రోజుల్లోనే ఉరిశిక్షను విధించడానికి గల సాధ్యసాధ్యాలపై వారిని అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించడానికి రూపొందించిన దిశ యాప్‌ గురించి కూడా ఈ సందర్భంగా ఇద్దరు హోం మంత్రుల మధ్య చర్చ కొనసాగింది. యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం దగ్గరి నుంచి వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు చేరవేయడం, ఆ వెంటనే బాధితుల వద్దకు పోలీసులను పంపించడం వరకూ ప్రతి అంశాన్ని సుచరిత.. మహారాష్ట్ర బృందానికి వివరించారు.

  బడ్జెట్ లేదా వర్షాకాల సమావేశాల్లో తీర్మానం..

  బడ్జెట్ లేదా వర్షాకాల సమావేశాల్లో తీర్మానం..

  మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే కిరాతకులకు 21 రోజుల్లోనే మరణ శాసనాన్ని లిఖించడానికి ఉద్దేశించిన చట్టం ఇది. ఈ తరహా చట్టాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఏపీ. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి చట్టాలను రూపొందించడానికి బాటలు వేసింది. మహారాష్ట్రలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లేదా వర్షకాల భేటీ సందర్భంగా దిశ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది.

  English summary
  Maharashtra Home Minister Anil Deshmukh meets his Andhra Pradesh's counter part Mekathoti Sucharita on Thursday. Anil Deshmukh and his team arrived Amaravati and for study AP Disha act to implement in Maharashtra. Anil Deshmukh announced that he will visit Andhra Pradesh to understand more about the Disha Act that stipulates stringent punishment in cases of atrocities against women on Monday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more