వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయదేవ్‌కు ఆ అవసరం లేదు: రాజకీయాలకు మహేష్ దూరమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ గల్లా జయదేవ్‌కు ఎవరో ప్రచారం చేయవలసిన అవసరం లేదని నటుడు మహేష్ బాబు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. మహేష్ బాబు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

ఈ గ్రామంలో ఆయన గత ఆదివారం పర్యటించారహు. ఈ సందర్భంగా.. బుర్రిపాలెంను దత్తత తీసుకోవడంలో ఎంపీ గల్లా జయదేవ్ సపోర్ట్ చేసినట్లున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రచారం చేస్తారా అని అడిగారు.

ఇలా చెక్ పెట్టారు!: స్టార్ హీరోలకు చంద్రబాబు పొలిటికల్ 'పంచ్'దీనికి మహేష్ బాబు స్పందిస్తూ.. తాను రాజకీయాలకు దూరం అని, తాను చెప్పిన మాట మీదే నిలబడ్డానని చెప్పారు. గల్లా జయదేవ్‌కు ఎవరో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆయన ప్రజల కోసం పోరాడే విధానం ఆయనకు ప్లస్ అవుతుందన్నారు.

 Mahesh Babu clarifies about politics!

కాగా, గత ఆదివారం బుర్రిపాలెంలో పర్యటించిన మహేష్ బాబు మాట్లాడుతూ... తాను బుర్రిపాలెం గ్రామానికి మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు. ఆయన తన బావ, టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఇతరులతో కలిసి తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మళ్లీ మళ్లీ మా ఊరొస్తా: మహేష్, రంగుల రోడ్డు బావుండదు.. ప్రిన్స్ చమత్కారంతనకు బుర్రిపాలెం గ్రామం రావడం చాలా చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన తండ్రి, తాత, బాబాయ్ ఊరికి చేశారని, నేను వారి దారిలో నడుస్తున్నానని చెప్పారు. మా ఊరిని దత్తత తీసుకోవడం గర్వంగా ఉందన్నారు. నేను శ్రీమంతుడు సినిమా చేస్తున్న సమయంలో తన బావ గల్లా జయదేవ్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని చెప్పారన్నారు.

తాను చేసిన శ్రీమంతుడు సినిమా కూడా ఓ ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వచ్చిందేనని చెప్పారు. తన బావ దత్తత తీసుకుంటే బాగుంటుందని చెప్పారన్నారు. తాను గ్రామంలో విద్య, వైద్య పైన ప్రధానంగా దృష్టి సారిస్తానని చెప్పారు. ఇకపై ఈ గ్రామానికి మళ్లీ మళ్లీ వస్తానని చెప్పారు.

English summary
Supers Stat Mahesh Babu clarifies about politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X