వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రంగంలోకి ఆదిశేషగిరిరావు: 'శిల్పా'కు మహేష్‌బాబు అభిమానుల మద్దతు, 'పవన్' మద్దతెవరికీ?

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల:నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులు వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 14వ, తేది నుండి నంద్యాలలో మహేష్‌బాబు అభిమానులు ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 23వ, తేదిన నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అయితే ఈ స్థానంలో విజయం సాధించేందుకుగాను టిడిపి, వైసీపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

'మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే''మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే'

ఈ నెల 9వ,తేది నుండి వైసీపీ చీఫ్ జగన్ నంద్యాలలోనే మకాం వేసి వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 19వ, తేది తర్వాత ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం లేకపోలేదు.

సెంటిమెంట్ పునరావృతమౌతోందా, చరిత్ర తిరగరాస్తారా, నంద్యాల తీర్పు ఎలా ఉంటుంది? సెంటిమెంట్ పునరావృతమౌతోందా, చరిత్ర తిరగరాస్తారా, నంద్యాల తీర్పు ఎలా ఉంటుంది?

నంద్యాల అసెంబ్లీ స్థానంలో జరిగే ఉపఎన్నికలో ఏ పార్టీకి మద్దతిచ్చే విషయమై జనసేస చీఫ్ పవన్‌కళ్యాణ్ ఇంకా స్పందించలేదు. ఈ విషయమై తమ పార్టీ వైఖరిని వెల్లడిస్తానని కూడ ఆయన ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఆ పార్టీ నుండి అధికారిక ప్రకటన రాలేదు,.

శిల్పాకు మద్దతుగా మహేష్‌బాబు అభిమానులు

శిల్పాకు మద్దతుగా మహేష్‌బాబు అభిమానులు

ఈ నెల 23వ, తేదిన జరిగే నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని సినీ నటుడు మహేష్‌బాబు అభిమానులు నిర్ణయం తీసుకొన్నారు. వైసీపీ నేత ఆదిశేషగిరిరావు సూపర్‌స్టార్ కృష్ణ, హీరో మహేష్‌బాబు అభిమానులతో సోమవారం నాడు సమావేశమయ్యారు. నంద్యాల ఉప ఎన్నికలపై చర్చించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. దీనికి మహేష్ అభిమానులు అంగీకరించారు. ఆగష్టు 14వ, తేది నుండి మహేష్‌బాబు అభిమానులు ప్రచారం నిర్వహించనున్నారు.

Recommended Video

Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
పవన్ కళ్యాణ్ మద్దతెవరికీ?

పవన్ కళ్యాణ్ మద్దతెవరికీ?

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ మద్దతు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు సుమారు 35 వేలకు పైగా ఉంటాయి. ముస్లిం మైనారిటీ ఓట్ల తర్వాత అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి.అయితే ఈ ఎన్నికల్లో పవన్ ఏ పార్టీకి మద్దతిస్తే ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకే అనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. కానీ,పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు ఈ విషయమై అధికారికంగా తన మద్దతు ఎవరికనే విషయాన్ని ప్రకటించలేదు. కానీ, భూమా కుటుంబం మాత్రం పవన్ తమకే మద్దతిస్తారని చెబుతున్నారు.

పవన్ మౌనం ఎందుకు

పవన్ మౌనం ఎందుకు

నంద్యాల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే విషయమై జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఇంకా మౌనంగానే ఉన్నారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబునాయుడును అమరావతిలో హర్వర్డ్ యూనివర్శిటీ డాక్టర్లతో కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. నంద్యాల ఉప ఎన్నికపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రకటించారు.అయితే అక్టోబర్ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజిగా ఉంటానని ఆయన ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో జనసేన చీఫ్ మౌనం వెనుక వ్యూహం ఉందా, లేక ఇతరత్రా కారణాలున్నాయా అనే అంశాలపై కూడ చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు ప్రకటన ఉంటుందా, అసలు ప్రకటనే ఉండదా అనే చర్చ కూడ లేకపోలేదు.అయితే మద్దతు విషయమై రెండు రోజుల్లో ప్రకటన చేస్తానని పవన్ ప్రకటించిన నేపథ్యంలో మద్దతు విషయంలో ప్రకటన ఉంటుందని విశ్వసించేవారు కూడ లేకపోలేదు.గత ఎన్నికల సమయంలో టిడిపి బిజెపికి కూటమికి మద్దతిచ్చిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడ టిడిపి అభ్యర్థికి పవన్ మద్దతిస్తారనే అభిప్రాయాలను కూడ వ్యక్తం చేసేవారు కూడ లేకపోలేదు. అయితే ఈ విషయాలన్నింటిపై జనసేన చీఫ్ నోరువిప్పితే గానీ స్పష్టత రాదు.

ప్రతిష్టాత్మకమైన పోటీ

ప్రతిష్టాత్మకమైన పోటీ

నంద్యాల ఉప ఎన్నికను టిడిపి, వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను ఈ రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ మేరకు తమకు ఏ అవకాశాలు గెలుపుకు సహకరిస్తాయో వాటన్నింటిని ఉపయోగించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు మహేష్‌బాబు అభిమానులను రంగంలోకి దించారు.

English summary
Superstar Mahesh babu fans association decided to support Ysrcp candidate Silpa Mohan reddy in Nandyal by poll.Ysrcp leader Adisheshagiri rao meeting with Mahesh fans association on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X