• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సుపర్ స్టార్ మహేశ్: ట్విట్టర్‌లో "సరిలేరు నీకెవ్వరు"

|

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్, మరోసారి కాలర్ ఎగరేశారు.. సగర్వంగా. మరోసారి తన సత్తా చాటారు. సోషల్ మీడియాలో తనకు తిరుగే లేదని నిరూపించుకున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు నాడే ఆయన నటిస్తోన్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ లుక్ ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండింటి ఎఫెక్ట్ ఏమిటనేది షేక్ అవుతోన్న ట్విట్టర్ ను చూసి అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు పుట్టినరోజు, సరిలేరు నీకెవ్వరు ఈ రెండు పేర్లు ట్విట్టర్ టాప్ ట్రెండ్ గా నిలిచాయి.

Mahesh Babu trends on Twitter on his birthday, and first look of his upcoming movie

మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ రెండు ట్వీట్ల సంఖ్య 10 లక్షలను దాటిపోయింది. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే పోతోంది. అంతకుముందు- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు మీద ట్వీట్లు టాప్ ట్రెండ్ లో ఉండగా.. దాన్ని అధిగమించారు మహేష్ బాబు. జాతిని ఉద్దేశించి నరేంద్ర మోడీ చేసిన ప్రసంగానికి సంబంధించిన ట్వీట్లు ట్రెండింగ్ నిలిచాయి. దాన్ని కొన్ని గంటల వ్యవధిలో డామినేట్ చేశారు.

తన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరులో ఆర్మీ మేజర్ అధికారిగా కనిపిస్తున్నారు మహేష్ బాబు. మేజర్ అజయ్ కృష్ణ అనే పేరుతో నటిస్తున్నారు. మంచు కొండల మధ్య పారుతున్న సెలయేటి పక్కన వేసిన ఆర్మీ క్యాంప్ నుంచి స్టైలిష్ గా నడుచుకుంటూ రావడానికి సంబంధించిన ఓ చిన్న కట్ ను ఫస్ట్ లుక్ గా విడుదల చేశారు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి.

Mahesh Babu trends on Twitter on his birthday, and first look of his upcoming movie

దీని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కట్..సోషల్ మీడియాలో విడుదలైన మరుక్షణం నుంచే ట్రెండింగ్ లో నిలిచింది. దీనిపై ట్వీట్ చేస్తోన్న వారి సంఖ్య గంటగంటకూ పెరుగుతూ పోయింది. ట్వీట్ల విషయంలో కూడా మహేష్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదివరకు ప్రభాస్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ఆయన అభిమానలు చేసిన ట్వీట్లతో పోల్చుకుంటే.. మహేష్ బాబు తాజాగా సాధించిన ట్వీట్ల సంఖ్య అధికం.

<strong>వయానాడ్ కకావికలం: మట్టిలో కూరుకుపోయిన నివాసాలు: ప్రధానికి రాహుల్ గాంధీ ఫోన్!</strong>వయానాడ్ కకావికలం: మట్టిలో కూరుకుపోయిన నివాసాలు: ప్రధానికి రాహుల్ గాంధీ ఫోన్!

Mahesh Babu trends on Twitter on his birthday, and first look of his upcoming movie

ఆర్మీ అధికారిగా నటించడం మహేష్ బాబుకు ఇదే తొలిసారి. ఆయన కేరీర్ లో ఇది 26వ సినిమా. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ అండ్ బ్యాక్, అవుట్ అండ్ అవుట్ ఇండస్ట్రీ హిట్లను నమోదు చేశారు. ఈ మూడు సినిమాలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి అవతల పడేశాయి. ఒకదాన్ని మించి ఒకటి హిట్లను కొట్టి.. తన రికార్డులను తనే తిరగరాసుకున్నారు మహేష్ బాబు. కన్నడ భామ రష్మిక మందన ఈ సినిమాలో మహేష్ తో తెరను పంచుకుంటున్నారు. మరో హీరోయిన్ గా ఆదితి రావు హైదరీ నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైమ్ కావడం అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

వివాదాలకు దూరంగా ఉండటం, కుటుంబాన్ని ప్రేమించడం మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. భార్య చాటు భర్తగా ఆయనకు పేరుంది. సినిమా పూర్తి కాగానే..విదేశాలకు ట్రిప్ వేయడం మహేష్ పాటించే ఆనవాయితీ.

Mahesh Babu trends on Twitter on his birthday, and first look of his upcoming movie

మహర్షి హిట్ తరువాత ఆయన తన కుటుంబంతో కలిసి యూరప్ ట్రిప్ కు వెళ్లొచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా సరిలేరు నీకెవ్వరు మూవీని రూపొందిస్తున్నాయి.

ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary
Superstar Mahesh Babu's #HappyBirthdaySSMB, which is trending at No.1 in the country, has pipped Prime Minister Narendra Modi's #ModiNationalAddress hashtag to the post. Mahesh Babu's fans are very aggressive this time unlike never before as the tweets started pouring in from host of his fans from several parts. But the moot question is that how Mahesh could trend nation-wide beating PM Modi on social media campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X