వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూచ్.. నేనూ చెప్పానుగా, 'లెక్కలు తియ్యడం కాదు.. లెక్కేంటో తేల్చండి': మహేష్ కత్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సి పరోక్షంగా చంద్రబాబుకు మేలు చేయడానికే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరగకుండా.. 'జేఎఫ్‌సి'ని తెరమీదకు తీసుకొచ్చారని మహేష్ కత్తి లాంటి విమర్శకులు వాదిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా మరోసారి పవన్ కల్యాణ్ రాజకీయ పంథాపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Recommended Video

Pawan Kalyan's JFC Meeting With Jayaprakash & Undavalli

'కాలాయపన కమిటీ మీటింగ్'..:

పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన 'జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్(జేఎఫ్‌సి)' ఒక కాలయాపన కమిటీ అని తేల్చేశారు మహేష్ కత్తి. నేడు జరగబోతున్న కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి 'పవన్ కల్యాణ్ కాలాయాపన కమిటీ మీటింగ్ ప్రారంభం' అని ఆయన ట్వీట్ చేశారు.
ఆఖరి బడ్జెట్ కూడా అయిపోయాక ఇంకా లెక్కల అధ్యయనంలో మునిగి తేలితే.. ఆ లెక్క తేలేదెన్నడూ.. పోరాటం చేసేదెన్నడూ? అని కత్తి ప్రశ్నిస్తున్నారు.

'కేంద్రబాబు' నిర్ణయం కోసం వెయిటింగ్.., ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వరు?: మహేష్ కత్తి 'కేంద్రబాబు' నిర్ణయం కోసం వెయిటింగ్.., ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వరు?: మహేష్ కత్తి

తూచ్.. నేనూ చెప్పానుగా..:

ఇక టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో 'పవన్ మనోడే' అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా కత్తి సెటైర్ వేశారు. "పవన్ కళ్యాణ్ మనోడే! -తెలుగుదేశం పార్టీ సమావేశంలో కేంద్రబాబు/చంద్రబాబు.. తూచ్!!! ఇదేగా నేను ఫస్ట్ నుంచీ చెబుతొంది." అని ట్వీట్ చేశారు. అంటే, పవన్ కల్యాణ్ ఇప్పటికీ చంద్రబాబుకు లబ్ది చేకూర్చేందుకే ప్రయత్నిస్తున్నారన్న కోణంలో ఆయన ఈ సెటైర వేశారని అర్థమవుతోంది.

లెక్కలు తియ్యడం కాదు.. లెక్క తేల్చండి:

చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ మరో ఆసక్తికర కామెంట్ చేశారు కత్తి. 'ఉద్యమకారులు లెక్కలు తియ్యడంలో కాలయాపన చెయ్యరు. లెక్కలు తేల్చేపనిలో ఉంటారు.' అన్న వ్యాఖ్యలతో చలసాని శ్రీనివాస్ గారిపై గౌరవం రెట్టింపు అయ్యిందన్నారు.

ఏపీ పీకలేవ్ పో అన్నాయ్..:

'పవన్ కళ్యాణ్ ఇచ్చిన గడువు దాటింది. గవర్నమెంట్లు "తూచ్!" అన్నాయి. ఏమీ పీకలేవ్ పో అన్నాయ్. ఇక తదుపరి కార్యక్రమం ఏమిటి పవన్ (కాలయాపనా)కళ్యాణ్ ?' అంటూ మరో ట్వీట్ ద్వారా ప్రశ్నించారు మహేష్ కత్తి. నిధుల లెక్కకు సంబంధించి ఈ నెల 15వ తేదీతో డెడ్ లైన్ పూర్తవడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రతికూల స్పందనే రావడంతో కత్తి ఇలా కామెంట్ చేశారు.

English summary
Critic Mahesh Kathi made interesting comments on Pawan Kalyan and CM Chandrababu Naidu. Kathi said JFC is a time waster process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X