వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! ఇలా చేస్తే పరకాల ఔట్: మళ్లీ రెచ్పిపోయిన మహిష్ కత్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ పై మరోసారి రెచ్పిపోయిన మహిష్ కత్తి, కులం గురించి ఘాటు వ్యాఖ్యలు !

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై మహేష్ కత్తి తన విమర్శల దాడిని ఆపడం లేదు. మరోసారి పవన్ కల్యాణ్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కులం పట్ల అనుసరిస్తన్న వైఖరిని ప్రశ్నించారు.

ప్రజారాజ్యం పార్టీ విషయంలో పరకాల ప్రభాకర్ పోషించిన పాత్రపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మహేష్ కత్తి స్పందించారు. పరకాల ప్రభాకర్‌ను ఔట్ చేయాలంటే ఏం చేయాలో కూడా ఆయన సూచించారు.

 ఇలా చేస్తే పరకాల ఔట్

ఇలా చేస్తే పరకాల ఔట్

"నీకు పరకాల ప్రభాకర్ మీద కక్ష తీర్చుకోవాలికదా. నా సలహా విను. నీ కక్షతో పాటు జరిగే కిటుకు చెబుతా విను. ఈ సదరు వ్యక్తి గోదావరి పుష్కర కమిటీకి ఛైర్మెన్. ఏ పుష్కరాల్లో షూటింగ్ కోసం తొక్కిసలాట జరిగి జనాలు చనిపోయారో, ఆ పుష్కరాల కమిటీనే. పుష్కరాల తొక్కిసలాటపై సి.వై.సోమయాజులు కమిటీ వేశారు. కానీ ఇంతవరకూ ఆ కమిటీ ఎటూ తేల్చలేదు. తెలిస్తే మాత్రం పరకాల ప్రభాకర్ ఔట్" అని మహేష్ కత్తి అన్నారు.

 దాని కోసం ప్రజా ఉద్యమం తెద్దాం

దాని కోసం ప్రజా ఉద్యమం తెద్దాం

"దీని కోసం ఒక ప్రజా ఉద్యమం తీసుకొద్దాం. స్వామికార్యం స్వకార్యం రెండూ అవుతాయి. పుష్కరాల్లో చనిపోయినవాళ్లకు న్యాయం. నీ కక్షకు కక్షా...ఒకే నా... నీకు ఒకే కాదులే...నీకు అంత ధైర్యం ఎక్కడుంది!ఎదో నాలాంటి వాళ్ళ మీద ఫ్యాన్స్ ని ఉసిగొల్పి ఇగో తృప్తిపర్చుకో. చాలు. నువ్వు నీ సలహాదారులు ఎవరూ రాజకీయానికి, ప్రజాక్షేమానికి పనికిరారు. Take it from me" అని మహేష్ కత్తి అన్నారు. నా బర్త్ డే గిఫ్ట్ అంటూ ముక్తాయింపు ఇచ్చారు.

 కులాలపై పవన్ కల్యాణ్ మాట్లాడడం

కులాలపై పవన్ కల్యాణ్ మాట్లాడడం

కులాల గురించి మాట్లాడడం, అంభేద్కర్ పెరియార్ ఇష్టం అంటూనే కుల వినాశనం గురించి ఎప్పుడూ మాట్లాడకుండా, దళితుల మీద జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం జనాలను మభ్య పెట్టడానికి ప్రయత్నమని మహేష్ కత్తి పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాల దళిత ఆడపడుచులను కాపాడతాను అని మన హీరో నోటివెంట వినాలని ఉంది... అవసరమున్న మాటలు మాట్లాడితే మంచిదని అన్నారు.

 ఈ నిర్లిప్తత ఎందుకు...

ఈ నిర్లిప్తత ఎందుకు...

కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడతాను అని అనకుండా కుల వివక్ష ఉన్నది ఉండబొద్ది అని నిర్లిప్తతతో కూడిన మాటలు మాట్లాడడం కొత్తగా రాజకీయాలలోకి వద్దామనుకుంటున్న పవన్ కల్యాణ్‌కు శోభాయమానం కాదని ఆయన అన్నారు. కులాల మధ్య అది కూడా రెండు కులాలను ప్రస్తావిస్తూ ఆ కులాల మధ్య సామరస్యం కోసం పోరాడితే కానీ అమరావతి అభివృద్ధి కాదన్నట్టు గ మాట్లాడడం అంత వాంఛనీయం కాదని అన్నారు. అన్ని కులాల మధ్య సామరస్యం ఆహ్వానించదగిన విషయం కానీ అమరావతి అన్న బెజవాడ అన్న కూడా ఆ రెండు కులాలు మాత్రమే కాదని అన్నారు.

అమరావతి

అమరావతి

అమరావతి అందరిదీ, కొందరిది కానే కాదు....ఎప్పుడో రెండు కుటుంబాల మధ్య గొడవను రెండు కులాల మధ్య గొడవగా ఆ ప్రాంతంలో అన్ని కులాల అందరి గొడవగా చూపడం చూడడం అవివేకం.... మిగతా వారందరికి ఆ పాత గొడవ ఒక తలనొప్పి, కొత్తగా అవతరించనున్న అమరావతికి ఒక మాయని మచ్చ అని మహేష్ కత్తి అన్నారు.

 అది అలా కాదా...

అది అలా కాదా...

ఎంతో మంది భూస్వాములు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న కాపు కులానికి, సామాజికంగా ఎటువంటి వివక్ష ఎదుర్కొనటువంటి కాపు కులానికి ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్స్ని ఒక అపహాస్యంగా చూడకుండా అది ఒక ఆవకాయ బద్ద కనీసం 15 శాతం ఇవ్వాలి అనడం సరైంది కాదని మహేష్ కత్తి అన్నారు.

 బీసీలకు ఎందుకు అడగరు...

బీసీలకు ఎందుకు అడగరు...

పికె అందరి వాడు అయితే బీసీలకు జనాభా సంఖ్య పరంగా అసెంబ్లీ సీట్లలో, ఉద్యోగాలలో 52% రిజర్వేషన్స్ ఎందుకు అడగట్లేదని, దళితుల గురించి ఎందుకు పోరాడడం లేదని మహేష్ కత్తి ప్రశ్నించారు.కాపులలో పేద వారికి వంద కోట్ల కాపు కార్పొరేషన్ ఉండగా సామజిక రిజర్వేషన్స్ గురించి అవగాహనా లేకుండా మాట్లాడడం నిరాశాజనకమని అభిప్రాయపడ్డారు.

English summary
Mahesh Katti once again made comments against Jana Sena chief Pawan Kalyan in Facebook posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X