వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్ ఎదిగారు, కానీ...: మెలిక పెట్టినమహేష్ కత్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ క్రిటిక్ మహేష్ కత్తి సానుకూల ప్రకటన చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరిని విమర్శిస్తూ వస్తున్న ఆయన తొలిసారి అనుకూలంగా వ్యాఖ్యానించారు.

అయితే, సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఓ మెలిక పెట్టారు. పవన్ కల్యాణ్ ఆలోచనల్లో ఎదుగుదల కనిపిస్తోందని ఆయన అన్నారు. అయితే, అది ఆచరణలోకి రావాలని ఆయన అన్నారు.

Recommended Video

Pawan Kalyan Vishakhapatnam tour : Kathi Mahesh hot comments | Oneindia Telugu
 అలా అవసరం లేదు...

అలా అవసరం లేదు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటానికి ప్రత్యేకంగా జెఎసి అవసరం లేదని మహేష్ కత్తి మెలిక పెట్టారు. పోరాటం చేస్తున్న పార్టీలు, ప్రజా సంఘాలతో కలిస్తే సరిపోతుందని ఆయన అన్నరు. గురువారం ఉదయం ఆయన విజయవాడ లెనిన్ సెంటర్‌లో ప్రతిపక్షాలతో కలిసి బంద్‌లో పాల్గొన్నారు.

 పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇదీ...

పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఇదీ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు అన్ని ప్రజా సంఘాలో కలిసి జెఎసి ఏర్పాటు చేసి పోరాటం చేస్తామని పవన్ కల్యాణ్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జెఎసి ఏర్పాటు చేసి ఉద్యమించిన విధంగానే ఎపీలో కూడా ప్రత్యేక హోదా కోసం జెఎసి ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

ఇలా ఆందోళన చేస్తున్నారు...

ఇలా ఆందోళన చేస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై విద్యార్థి, సంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర బంద్‌లో భాగంగా విద్యార్థి, యువజన సంగాల జెఎసి ఆధ్వరంలో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు.

 రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఇలా...

రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఇలా...

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా వామక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం బంద్ జరుగుతోంది. గురువారం ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్ల మీదికి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. విద్య, వ్యాపా సంస్థలు మూసేశారు.

English summary
Cine critic Mahesh Kathi has made positive comment on Jana Sena chief Pawan Kalyan at Vijayawada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X