వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్న చాటు తమ్ముడు పవన్, బాబుకు చుక్కెదురు: మహేష్ కత్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి ట్వీట్ చేశారు. ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పరిస్థితిపై కూడా ఆయన తన వాదనలు వినిపించారు.

పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం వైసిపి, మొన్నటివరకు ఉన్న మిత్రపక్షాలు బిజెపి, జనసేన హాజరు కాకపోతే అఖిల పక్షానికి అర్థం లేదని ఆయన అన్నారు. ఇది చంద్రబాబు వ్యూహానికి చుక్కెదురు అంటూ మరి ఎలా అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ ప్రకటనపై ఇలా.

పవన్ కల్యాణ్ ప్రకటనపై ఇలా.

"Inclusive capital అంటే సీమ వాళ్లకు ఇంత. ఉత్తరాంధ్ర ప్రజలకు భాగం ఇంత అని కాదు పవన్ కళ్యాణ్! ఏర్పడబోయే రాజధాని అన్ని తరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది. అర్బన్ ప్లానింగ్ లో అదొక ఫండమెంటల్ ప్రిన్సిపల్. కాస్త తెలుసుకుని మాట్లాడు బాబూ!!" అని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అఖిల పక్షంపై..

చంద్రబాబు అఖిల పక్షంపై..

"సాగినన్ని నాళ్ళు ఏకపక్షం. ఇప్పుడేమో అఖిల పక్షం. కలుపుకుని వెళ్లే ధోరణి మొదటి నుంచీ ఉండి ఉంటే, ఇంత ప్రమాదకరంగా పరిస్థితులు మారి ఉండేవి కావేమో!" అని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంపై మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.

అన్న చాటు తమ్ముడు పనవ్

అన్న చాటు తమ్ముడు పనవ్

"అన్నచాటు తమ్ముడు పవన్ కళ్యాణ్ కి. పరిశ్రమలో ఎవరి అండా లేకుండా ఎదగడంలోని కష్టం ఎలా తెలిసొచ్చిందబ్బా! అయినా నితిన్ ఎవరి అండా లేకుండా ఎక్కడొచ్చాడు? తండ్రి సుధాకర్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్ కాదా. జయం సినిమాలో ఇన్వేష్ట్ చెయ్యలేదా! కథలు భలే చెప్తారబ్బా. అవి సినిమాల్లో చెప్పండి. బయటకాదు" అని మహేష్ కత్తి అన్నారు.

 వామపక్షాలపై మహేష్ కత్తి ఇలా...

వామపక్షాలపై మహేష్ కత్తి ఇలా...

"జనసేనతో కలిసి వామపక్షాలు మరో చారిత్రక తప్పిదం దిశగా అడుగులు వేస్తున్నాయా?" అని మహేష్ కత్తి మరో ట్వీట్ పోస్టు చేశారు. "పుష్కరాలలో వృధా అయిన నిధుల గురించి నాలుగు సంవత్సరాల తర్వాత ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్. ఆ తొక్కిసలాటలో చనిపోయిన మనుషుల గురించైనా అప్పుడు మాట్లాడి ఉంటే, నిజంగానే హీరో అనిపించుకునేవాడు. ఇప్పుడు సగటు రాజకీయనాయకుడికన్నా చీప్ గా అనిపిస్తున్నాడు" అని పవన్ కల్యాణ్‌ను మరో ట్వీట్‌లో తప్పు పట్టారు.

వైసిపికి పవన్ కల్యాణ్ తీరు లాభమేమీ కాదు...

వైసిపికి పవన్ కల్యాణ్ తీరు లాభమేమీ కాదు...

"బిజెపి మోసం చేసింది. తెలుగుదేశం కాంప్రమైజ్ అయ్యింది. వైసీపీ చిత్తశుద్ధితో పోరాడలేదని జనసేన-వామపక్షాలు డిసైడ్ చేశాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో త్రిముఖ పోరు మొదలైనట్టే. మారిన పవన్ కళ్యాణ్ తీరు వైసీపీ కి లాభదాయకం అనుకున్న భ్రమ ఇప్పుడు తొలగినట్టే. ఎవరికివారే యమూనాతిరే!" అని ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలపై మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.

English summary
Cine critic Mahesh Kathi made series of comments on Jana Sena chief Pawan Kalyan and Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X