అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలపై జగన్ తేల్చేశారు... డెడ్‌లైన్ ఫిక్స్ : సీఎం ఆలోచన ఏంటి..?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెలరోజుల్లోగానే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు సీఎం జగన్ గుర్తుచేశారు. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇక పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చామని సీఎం జగన్ చెప్పారు.

డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చినట్లు జగన్ వివరించారు. పోలీస్‌యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలని పిలుపునిచ్చిన జగన్... దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే అనర్హత వేటు విధిస్తామని సీఎం జగన్ తేల్చిచెప్పారు. అంతేకాదు మూడేళ్ల పాటు జైలు శిక్ష పడుతుందన్నారు.
డబ్బులను, మద్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రులను, గ్రామంలో మహిళా పోలీసులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. ఎక్కడా డబ్బు పంపిణీచేశారన్న మాట రాకూడదని స్పష్టం చేసిన సీఎం జగన్... ఎన్నికల్లో లిక్కర్‌ పంచారన్న మాట వినిపించకూడదన్నారు.

Make all the necessary arrangements for smooth conduct of Local body elections:CM Jagan

ఎవరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి కోట్లుకోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడంకాదని ఊర్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి సేవచేసే వ్యక్తులు ఎన్నిక కావాలని చెప్పారు. అందుకే కోసమే ఈ మార్పులు తీసుకు వస్తున్నట్లు జగన్ చెప్పారు. మన రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలని చెప్పిన జగన్జజజ సాధారణ ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్‌ ఉపయోగించిన మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్‌ అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు ఈ సమాచారం చేరాలని సీఎం జగన్ సూచించారు.

గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రులు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా మిత్రులు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈయాప్‌ ఉండేలా చూడాలన్నారు. ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలని సీఎం సూచించారు. ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయాలి, జైలుకు పంపాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.

English summary
AP CM Jagan conductred a review meeting in the wake of high court order on localbody elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X