విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల సిత్రాలు .. గౌను వేసుకుని ఎన్నికల ప్రచారం చేసిన అభ్యర్థి

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అన్నయ్యల మీద తమ్ముళ్లు పోటీ చేయడాలు, భార్య మీద భర్త పోటీచేయడం వాటి సంగతి అటుంచితే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తమ గుర్తులు గుర్తుండిపోయేలా వాటితోనే ప్రచారం చేస్తున్నారు .

పంచాయతీ పోరు .. బొత్సా టార్గెట్ గా విజయనగరం వైసీపీలో ఇంటర్నల్ వార్ .. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఫైర్పంచాయతీ పోరు .. బొత్సా టార్గెట్ గా విజయనగరం వైసీపీలో ఇంటర్నల్ వార్ .. నెల్లిమర్ల ఎమ్మెల్యే ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల బరిలో నిలిచిన ఒక వ్యక్తి గౌను వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీపురం పంచాయతీలు ఏడవ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో గౌను వేసుకుని మరీ తమకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంతకీ ఎన్నికల్లో పోటీ చేసిన ఈ అభ్యర్థి గౌను వేసుకోవడానికి గల కారణం ఏమిటంటే ..

Male Candidate campaigned in a gown in vizianagaram district for panchayat elections

నివాసరావు ఎన్నికల గుర్తు 'గౌను', దీంతో ఓటర్లందరికీ తన గుర్తు గుర్తుండిపోయేలా శ్రీనివాస రావు, తన అనుచరులతో కలిసి గౌను వేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

రోడ్డు మీద గౌరవం వేసుకుని తిరుగుతూ తమకే ఓటేయాలని అభ్యర్థిస్తున్న ఈ అభ్యర్థి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనప్పటికీ గౌన్లు వేసుకొని రోడ్డున పడిన అభ్యర్థికి ఓటు వేస్తారో లేదో తెలియదు కానీ, గౌను ప్రచారం మాత్రం ఓటర్లందరికీ కచ్చితంగా గుర్తుండిపోతుంది.

English summary
Srinivasa Rao, who is contesting as the 7th ward member of Gummalakshmipuram panchayat in Vizianagaram district, got the 'gown' symbol. With this, Srinivasa Rao took to the streets in a gown to make his mark remembered by all the voters. He is campaigning by wearing a gown to be remembered by the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X