• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మల్కాన్‌గిరి ఎన్‌కౌంటర్: గాయపడిన ఆర్కె, తప్పించుకున్న గాజర్ల రవి

By Pratap
|

విశాఖపట్నం: ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరిలో జరిగిన ఎన్‌కౌంటర్ విషయంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆంధ్రా ఒడిసా సరిహద్దు (ఏవోబీ)లో జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే గాయపడినట్లు తెలిసింది. కాగా, ఎన్‌కౌంటర్‌లో మరణించాడని భావిస్తున్న మరో కీలక నేత గాజర్ల రవి తప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాల్పులు జరుగుతున్న సమయంలోనే గన్‌మెన్‌ ఆర్కెను ఎత్తుకొని వెళ్లారని, ఈ క్రమంలోనే ఆయనకు గాయాలయ్యాయని సమాచారం. పోలీసు కాల్పుల్లో ఆర్కే గన్‌మెన్‌ ముగ్గురు మరణించారు. వారిలో సిమ్రును సోమవారమే గుర్తించారు. మంగళవారం మరో ఇద్దరిని గుర్తించారు.

Encounter Photos

Malkangiri encounter: RK injured and Gajarla ravi escaped?

పోలీసులకు సజీవంగా చిక్కిన వ్యక్తి కూడా సెక్యూరిటీ గ్రూప్‌నకు చెందిన వ్యక్తేనని అనుమానిస్తున్నారు. కాల్పులు మొదలైన వెంటనే ఆర్కే ప్రత్యేక రక్షణ దళం తమపై కాల్పులు జరుపుతూ ఆ ప్రాంతం నుంచి ఆయన్ను తీసుకెళ్లిపోయిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు.

ఆర్కేతోపాటు గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌, ఆయన సెక్యూరిటీ టీమ్‌ 20 మంది ఉన్నట్లు చెబుతున్నారు. వీరిని పట్టుకునేందుకే జాయింట్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారని సమాచారం. ఈ స్థితిలో మరికొద్ది రోజులపాటు భారీస్థాయి కూంబింగ్‌ జరుగుతుందని తెలిసింది. కోరాపుట్‌, మల్కనగిరి, గుమ్మ తదితర ప్రాంతాల్లో ఏకంగా 13 సెక్యూరిటీ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయి. మల్కాన్‌గిరి, కోరాపుట్‌ పరిధిల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున సీఆర్‌ పీఎఫ్‌ బలగాలు మోహరించాయి.

Malkangiri encounter: RK injured and Gajarla ravi escaped?

మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన గాజర్ల రవి క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత సువర్ణరాజు అలియాస్‌ కిరణ్‌ కూడా మరణించారు. ఆయన ప్రస్తుతం పెద్దబయలు ఏరియా కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం పోలీసు వర్గాలు ఇతని పేరును ధ్రువీకరించాయి. ఇంకా ఆరుగురిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు.

మల్కాన్‌గిరికి వరవరరావు

విరసం నేతలు వరవరరావు, కల్యాణ్ రావు, ఆర్కె భార్య శిరీష మల్కాన్‌గిరి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు 24 మృతదేహాలకు పోస్టు మార్టం జరిగింది. మరో నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం జరగాల్సి ఉంది. మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

Malkangiri encounter: RK injured and Gajarla ravi escaped?

దీనికి ఎన్‌కౌంటర్ అనే పదం కూడా సరిపోదని వరవరరావు అన్నారు. అడవిలోకి పట్టుకెళ్లి కాల్చి చంపారని ఆయన ఆరోపించారు. ఇది పోలీసుల దుర్మార్గపు చర్య అని అన్నారు. హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేసారు.

ఇది నరసంహారం, మారణకాండ అని వరవరరావు అన్నారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు ప్రభాకర్ విషయాన్ని దాచిపెట్టి, గాజర్ల రవి, చలపతిలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

గణేష్ మృతదేహం గుర్తింపు

మావోయిస్టు నేత బాకూరు వెంకటరమణ అలియాస్‌ గణేష్‌ మృతదేహాన్ని భార్య, బంధువులు
గుర్తించారు. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్లో మరణించిన 24 మందిలో ఆయన కూడా ఉన్నట్లు దీంతో రాత్రి మల్కన్‌గిరి వెళ్లిన గణేష్‌ బంధువులు గుర్తించారు. ఆయన స్వగ్రామం హుకుంపేట మండలం బాకూరు.

1994 నుంచి అంచెలంచెలుగా ఎదిగి మావోయిస్ట్‌ ఏవోబీ సెక్రటరీగా ఎదిగారు. ఏజెన్సీలో జరిగిన మావోయిస్టు చర్యల్లో కీలకంగా పనిచేశారు. ఏజెన్సీలో పోలీసులు జ‌రిపిన ఎదురుకాల్పుల్లో గ‌ణేష్‌ చాలా సార్లు తప్పించుకున్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నట్లు సమాచారం.

English summary
It is said that Maoist top leader Akkiraju Haragopal alias Ramakrishna alias RK injured in Malkangiri encounter and Gajarla Ravi escaped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X