వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హామీలకు కట్టుబడి ఉండాలి: బాబుకు పవన్ కళ్యాణ్, జనసేనానిని కలిసిన కాంగ్రెస్ నేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఏపీ మత్స్యకారుల సంఘాలు సోమవారం కలిశాయి. పుదుచ్చేరి కాంగ్రెస్ నేత మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో వారి సమస్యలను జనసేనాని దృష్టికి తీసుకు వెళ్లారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. మత్స్యకారుల సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మల్లాడి, కాంగ్రెస్ నేత అని, ఆయనకు ప్రజా సమస్యలపై నిబద్దత ఉందన్నారు. ఇలాంటి వారు ఎవరైనా తాను పార్టీలకు అతీతంగా ఉంటానని అభిప్రాయపడ్డారు.

Malladi Krishna Rao and fishermen meets Jana Sena chief Pawan Kalyan,

కేవలం ప్రజా సంక్షేమం గురించి పరితపించే వ్యక్తి మల్లాడి అన్నారు. మత్స్యకారులు ఎస్టీ జాబితాలో ఉండాలన్నారు. మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసునని చెప్పారు. వారిని ఎస్టీల్లో చేర్చే ఉద్యమానికి అండగా ఉంటానని, వారి దీక్షను అడ్డుకోవడం సరికాదన్నారు.

కేవీపీ వైసీపీలోకి ఎందుకు వెళ్లట్లేదు? జగన్-షర్మిల మధ్య విభేదాలపై వైవీ ఇలా..కేవీపీ వైసీపీలోకి ఎందుకు వెళ్లట్లేదు? జగన్-షర్మిల మధ్య విభేదాలపై వైవీ ఇలా..

శాంతియుత దీక్షలను అడ్డుకోవద్దన్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చుతామని చంద్రబాబు, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానికి కట్టుబడి ఉండాలన్నారు.

కమిటీ వేసి, పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లి, మత్స్యకారులకు భరోసా ఇవ్వాలన్నారు. తాను ప్రధాని మోడీని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. తీర ప్రాంతాల్లో కాలుష్యంతో మత్స్యకారులు ఇబ్బందిపడుతున్నారన్నారు.

English summary
Congress leader Malladi Krishna Rao and Andhra Pradesh fishermen meets Jana Sena chief Pawan Kalyan on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X