వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు కు మ‌మ‌త గండం..గ‌ట్టెక్కేనా..!

|
Google Oneindia TeluguNews

కేంద్రంలో బిజెపి వ్య‌తిరేక కూట‌మిని కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్న టిడిపి అధినేత చంద్ర‌బాబుకు తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ నుండి గండం పొంచి ఉంది. బిజెపి వ్య‌తిరేక గ‌ళం విప్పే వారిలో కాంగ్రెస్ త‌రువాతి స్థానం మ‌మ‌త దే. జాతీయ రాజ‌కీయాల్లో మ‌మ‌త ప్రాబ‌ల్యం బ‌లంగా ఉంది. దీంతో..మ‌మ‌త సాధార‌ణంగానే బిజెపి వ్య‌తిరేకం అయినా.. ఇప్పుడు చంద్ర‌బాబు నేతృత్వంలో జ‌రుగుతున్న కూట‌మి ఏర్పాటు పై మాత్రం అనేక అనుమానాలు..సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే...అనేక ప్ర‌శ్న‌ల‌ను బాబుతో స‌మావేశం స‌మ‌యంలో ఆయ‌న ముందు ఉంచా రు. ఇక‌, ప్ర‌స్తుతం ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత‌నే అన్ని స‌మావేశాలు అంటూ ఈనెల 22న ఏర్పాటు చేసిన బిజెపి వ్య‌తిరేక కూట‌మి స‌మావేశం వాయిదా వేయించారు. ఇక‌, త‌న నాయ‌క‌త్వంలోనే అన్ని జ‌రగాల‌ని భావిస్తున్న మ‌మ‌తా రాజ‌కీయ ల‌క్ష్యం సుస్ప‌ష్టం. ఇక‌..మ‌రి ...చంద్ర‌బాబు ఏం చేస్తారు..

చంద్ర‌బాబు కు మ‌మ‌త షాక్‌..!

చంద్ర‌బాబు కు మ‌మ‌త షాక్‌..!

ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసుకొని బిజెపి వ్య‌తిరేక పార్టీల అధినేతల వ‌ద్ద‌కు వెళ్తున్న చంద్ర‌బాబుకు మ‌మ‌త వ‌ద్ద మాత్రం ఆశించిన స్పంద‌న ల‌భించ‌లేద‌ని టాక్‌. ఈ నెల 22న ఎన్డీఏ వ్య‌తిరేక పార్టీల‌తో ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేయాల‌ని ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డిసైడ్ అయ్యారు. ఆ మీటింగ్ కు రావాల్సిందిగా మ‌మ‌తా బెన‌ర్జీని స్వ‌యంగా ఆహ్వానించేం దుకు కోల్‌క‌త్తా వెళ్లారు. స‌హ‌జంగా ప్ర‌ధాని మోదీ వ్య‌వ‌హార శైలి పై చ‌ర్చ జ‌రిగింది. మోదీ కంటే సీనియ‌ర్ నేత‌గా ఉన్నా మ‌ని చంద్రబాబు ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, సిబిఐ, ఈడి, ఐటి శాఖ‌ల దుర్వినియోగం పైనా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు అందులో పాల్గొన్న నేత‌ల ద్వారా అందుతున్న స‌మాచారం. ఇక‌, మోదీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీల నేత‌లూ ఒక్క‌టిగా ఉన్నామ‌నే సంకేతాలు ఇవ్వాల‌ని..ఇందు కోసం ఈనెల 22న ఢిల్లీలో స‌మావేశం అవుదామ‌ని చంద్ర‌బాబు ప్ర‌తిపాదించా రు. కానీ, అందుకు మ‌మ‌తా బెన‌ర్జీ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ తో ఉన్న పార్టీలే ఈ స‌మావేశానికి హాజ‌రైతే ఉప‌యోగం లేద‌ని.. కాంగ్రెస్ - బిజెపికి వ్య‌తిరేకంగా ఉన్న ఇత‌ర పార్టీల‌ను క‌లుపుకుపోవాల‌ని సూచించారు. బిజెడి వంటి పార్టీల‌ను బిజెపికి వ్య‌తిరేకంగా పోరాడేందుకు క‌లుపుకుపోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వివ‌రించారు. త‌న‌కు ప‌శ్చిమ బెంగాల్‌లో వామ‌ప‌క్షాల తో రాజ‌కీయంగా వైరుధ్యం ఉంద‌ని చెబుతూ...జాతీయ స్థాయిలో వారితో క‌లిసి పోరాటం చేయ‌టానికి ఇబ్బంది లేద‌ని తేల్చి చెప్పారు. అదే స‌మ‌యంలో మ‌మ‌తా చేసిన మ‌రి కొన్ని కామెంట్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఎందుకు ఈ తొంద‌ర అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

ఎందుకు ఈ తొంద‌ర అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం..

ఇక ఈ నెల 22న ఢిల్లీలో ఏర్పాటు చేసిన స‌మావేశం గురించి చ‌ర్చ జ‌రిగిన స‌మ‌యంలో..మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆ పార్టీ నేత‌లు వెలుగులోకి తీసుకొస్తున్నారు. స్థానిక మీడియా ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆ స‌మాచారం ఇప్పుడు తెలుగుదేశం నేత‌ల్లోనూ చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అయిదు చోట్ల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. వాటి ఫ‌లితాలు చూస్తూ సాధార‌ణ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ - బిజెపి ప‌రిస్థితి ఏంటో ఒక అంచ‌నాకు రావ‌చ్చ‌ని మ‌మ‌తా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కు పూర్తి పెత్తనం ఇవ్వటానికి లేదా..కాంగ్రెస్ పైనే పూర్తిగా ఆధార‌ప‌డ‌టానికి మ‌మ‌తా సిద్దంగా లేర‌నే విష‌యం కుండ బ‌ద్ద‌లు కొట్టేసారు. బిజెపికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే కూట‌మి ద్వారా త‌న రాజ‌కీయ వ్యూహం ఏంట‌నే విష‌యం లో మ‌మ‌తా చాలా క్లియ‌ర్ గా ఉన్నట్లు టిడిపి నేత‌ల‌కు అర్ద‌మై పోయింది. కాంగ్రెస్ ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తుతో త‌న జీవిత ల‌క్ష్యం అందుకోవ‌టం మ‌మ‌తా బెన‌ర్జీ రాజ‌కీయ ల‌క్ష్యం నెర‌వేర్చుకోవాల‌ని భావిస్తున్నారు. బిజెపి వ్య‌తిరేక కార‌ణం చూపి..కాంగ్రెస్ మద్దుత ఇవ్వ‌టం మిన‌హా మ‌రో మార్గం లేకుండా చేయాల‌నేది మ‌మ‌తా ఆలోచ‌న‌గా టిడిపి నేత‌లు ప‌సి గట్టారు. దీంతో..మ‌మ‌త తో అంత త్వ‌ర‌గా ఏ విష‌యం తేల‌ద‌నే అభిప్రాయానికి వ‌చ్చేసారు. అదే స‌మ‌యంలో మ‌మ‌త సంధించిన ప్ర‌శ్న‌లు టిడిపి ముఖ్య‌నేత‌ల‌కు మింగుడు ప‌డ‌లేద‌ని సమాచారం.

మ‌మ‌తా వారిని న‌మ్మ‌టం లేదా...

మ‌మ‌తా వారిని న‌మ్మ‌టం లేదా...

మ‌మ‌తా బెన‌ర్జీ తెలుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల విష‌యంలో ఎలాంటి అభిప్రాయం ఉన్నార‌నేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ స్వ‌యంగా వెళ్లి మ‌మ‌త‌ను క‌లిసారు. ఆ ప్ర‌తిపాద‌న‌లు చ‌ర్చ‌ల‌కే ప‌రిమితం అయ్యాయి. ఇప్పుడు ఏపి ముఖ్య‌మంత్రి మ‌రో ప్ర‌తిపాద‌న‌తో మ‌మ‌త వ‌ద్ద‌కు వెళ్లారు. అయితే, ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌తో మ‌మ‌త త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. మోదీ వ్య‌తిరేక కూట‌మి లో త‌న‌ది కీల‌క పాత్ర కావాల‌ని మ‌మ‌త కోరుకుంటున్నారు. దీని కార‌ణంగానే ఎవ‌రు వ‌చ్చినా నో అని చెప్ప‌టం లేదు గానీ, జాతీయ రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తూ..త‌న చుట్టూ కేంద్రీకృతం అవ్వాల‌ని మాత్రం ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే...చంద్ర‌బాబు తో ఒన్ టు ఒన్ స‌మావేశంలోనూ నేరుగా త‌న అభిప్రాయాల ను స్ప‌ష్టం చేసారు. అయితే, మ‌మ‌తా సూచ‌న‌తో బిజెపి వ్య‌తిరేక కూట‌మి స‌మావేశం వాయిదా నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు..ఇత‌ర ప‌క్షాల‌కు స‌మాచారం అందించారు. అయితే, ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్రాంతాల్లో ఫ‌లితా ల ఆధారంగా..ఈ స‌మావేశం భ‌విష్య‌త్ ఆధార ప‌డి ఉంది.

English summary
Non B.J.P alliance under leader ship of Tdp president and A.P C.M Chandra Babu seem to b in different opinion. West Bengal C.M and T.M.C president Mamata Banerjee differed with Chandrababu on some decisions. She wants to be upper hand in anti Bjp alliance leadership. with suggestion of Mamat Banerjee anti Bjp partys meeting has been post poned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X