వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌ధాని రేసులో చంద్ర‌బాబూ ఉన్నారు : కేసీఆర్ తో మాట్లాడా: మ‌మ‌తా కీల‌క వ్యాఖ్య‌లు..

|
Google Oneindia TeluguNews

మ‌మ‌తా బెనర్జీ కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ ను క‌లిసిన మ‌మ‌తా..జాతీయ స్థాయ రాజ‌కీయాల పై స్పందించారు. తాను ప్ర‌దాని ప‌ద‌విని ఆశిస్తున్న‌ట్లు కాద‌ని..ప్ర‌ధాని ప‌ద‌వికి రాహుల్ తో పాటుగా పవార్.. ఫ‌రూఖ్‌.. చంద్ర‌బాబూ ఉన్నారంట చేసిన కామెంట్ ఇప్పుడు ఏపి లో హాట్ టాపిక్‌గా మారింది.

ప్ర‌ధాని రేసులో వారంతా ఉన్నారు..
సార్వత్రిక ఎన్నికలకు ముందే పొత్తులపై అవగాహన ఉంటుందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి పొత్తులు ఆధారపడి ఉంటాయని తెలిపారు. రాష్ట్రాల్లో ఎవరి ఇష్ట ప్రకారం వారు ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో వ్యతిరేకించుకున్నా ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తామన్నారు. జాతీయ రాజ‌కీయాల్లో తొలుత చంద్ర‌బాబు ప్ర‌యత్నాలుకు మ‌మ‌తా అంత‌గా స‌హ‌క‌రించ‌లేదు. ఆ త‌రువాత కేసీఆర్ కోల్‌క‌త్తా వెళ్లి మ‌మ‌తా తో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చించారు.

Mamatha benerjee key comments on Chandra Babu : He is in race for PM

ఆ స‌మ‌యం లోనూ త‌న అభిప్రాయం ఏంటో మ‌మ‌త స్ప‌ష్టం చేయ‌లేదు. ఇక‌, కొద్ది రోజులుగా కేంద్రం తో ఢీ అంటే ఢీ అంటున్న మ‌మ‌తా బెనర్జీ ప్ర‌ధాని రేసులో ముందున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ ను ప్ర‌ధానిగా అంగీక‌రించ‌టం లేద‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని పోటీలో బాబు ఉన్నార‌ని చెప్ప‌టం తాజాగా ఏపి రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

కేసీఆర్ తోనూ మాట్లాడాను..
ఇక‌, ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెస్ - బిజెపి ఇత‌ర పార్టీల‌తో కేసీఆర్ చేసిన మంత‌నాలు కొద్ది రోజులుగా నిలిచిపోయా యి. అయితే, తాజాగా కేసీఆర్ తోనూ తాను మాట్లాడాన‌ని చెప్ప‌టం ద్వారా కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌తిపాద‌నుల విర మించుకున్నారా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడానని చెప్పారు. 'అందరూ వస్తారు... వేచి చూడండి' అని మ‌మ‌తా విశ్వాసం వ్యక్తం చేశారు.

Mamatha benerjee key comments on Chandra Babu : He is in race for PM

అందరితో కలిసి ముందుకెళ్తానం టే తాను ప్రధాని పదవిని ఆశిస్తున్నట్లు అర్థం కాదన్నారు. అయితే కొద్ది రోజులుగా కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల పై కొంత మౌనం పాటిస్తున్నారు. ఇక‌, ప్ర‌ధాని ప‌ద‌వి పై త‌న‌కు ఆలోచ‌న లేద‌ని..ఏపి పైనే త‌న దృష్టి అని ఏపి ముఖ్య‌మం త్రి చంద్ర‌బాబు ప‌లు మార్లు చెప్పారు. కానీ, తాజాగా మ‌మ‌తా మాత్రం ..ఆ పదవికి రాహుల్‌గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఎన్సీ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా, ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు దీని పై టిడిపి అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
West Bengal CM Mamata Benarjee key commetns on Aspirants of PM in up coming elections. She mentioned four names including AP Cm Chandra babu also in race for PM. No these comments creating political heat in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X