వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరాతకం :మహిళలపై అత్యాచారం చేసి, హత్య చేస్తాడు

మాయమాటలు చెప్పి మహిళలను లోబర్చుకొని అత్యాచారం చేసి వారికి అతి కిరాతకంగా హతమారుస్తున్న లక్ష్మినారాయణ అనే నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి జిల్లా :మాయమాటలు చెప్పి మహిళలను లోబర్చుకొని అత్యాచారం చేసి వారికి అతి కిరాతకంగా హతమారుస్తున్న లక్ష్మినారాయణ అనే నిందితుడిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

కథలు చెబుతామంటూ తిరుగుతూ తన మాటల చాతుర్యంతో మహిళలను లోబర్చుకోవడం వారిపై అత్యాచారం చేసి హత్య చేస్తున్నాడు లక్ష్మీనారాయణ. మహిళల ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడ దోచుకొనేవాడు.

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన చేపూరి భాగ్యవతి అదృశ్యంపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు షాక్ తిన్నారు.

కపిలేశ్వరం మండలం కేదారిలంకకు చెందిన సలాది లక్ష్మినారాయణ..దుర్గాదేవి,వెంకన్నబాబుల కథలు చెబుతుంటారు. కథ చెప్పడానికి పరిసర గ్రామాలకు వెళ్ళిన సమయాల్లో అమాయక మహిళలను తన మాయామాటలతో లక్ష్మీనారాయణ లోబర్చుకొనేవాడు.

 man allegedly rape and murder arrested in eastgodavari police

నెల రోజుల క్రితం మామిడికుదురులోని ఆల్ క్యాస్ట్ కాలనీకి కథ చెప్పేందుకు వెళ్ళాడు. ఆ సమయంలో చేపూరి భాగ్యవతితో ఆయన పరిచయం పెంచుకొన్నాడు. ఈ నెల 8వ, తేదిన పిచ్చుక లకం, వెలాపులంక మద్య ఇసుకదిబ్బలలోకి ఆమెను తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు.

అత్యాచారం చేసిన తర్వాత జేబు రుమాలుతో ఆమె గొంతు బిగించి చంపాడు. ఆమె చెవిదిద్దులు, కాళ్ళపట్టీలు, సెలో ఫోన్ తీసుకొని మృతదేహన్ని అక్కడే వదిలివెళ్ళిపోయాడు.

2012 లో పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దురిలంకకు చెందిన ఆకుల నాగమణి, 2014 లో యానాంకు చెందిన సత్యవతి, దంగేరుకు చెందిన మరో వివాహితను, 2015 ఫిబ్రవరిలో మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన బద్రి సత్యవతిని ఇదే రకంగా హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.

English summary
a man arrested eastgodavari police, laxminaraya allegedly rape and murderd five ladies, from 2012 laxmi naraya contiues this type incidents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X