వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేరు మార్చుకుని ఎపిలో నాలుగేళ్లు అజ్ఞాతం: సెల్ఫీ పట్టిచ్చింది

By Pratap
|
Google Oneindia TeluguNews

చెన్నై: పేరు మార్చుకుని ఆంధ్రప్రదేశ్‌లో రహస్యంగా జీవిస్తున్న భార్య గొంతు కోసిన కేసులో నిందితుడిని పోలీసులు సెల్ఫీ ఆధారంగా పట్టుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని అరియళూరు ప్రాంతానికి చెందిన మణి అనే వ్యక్తి ఉద్యోగ రిత్యా విదేశాల్లో ఉండేవాడు.

ఇతనికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. 2009లో మణి స్వస్థలం చెన్నైకి వచ్చాడు. అప్పటి నుంచి మణి భార్య విజయలక్ష్మిపై అనుమానంతో రోజూ ఆమెతో గొడవపడుతుండేవాడు. ఓసారి ఇలాగే గొడవపడుతూ భార్య గొంతు కోసి పారిపోయాడు. పోలీసులు మణిపై కేసునమోదు చేసి గత ఏడేళ్లుగా అతని కోసం గాలించారు.

Man arrested in murder case after 4 years

ఇటీవల మణి తన స్నేహితులతో కలిసి దిగిన సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఫోటో చూసిన విజయలక్ష్మి బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫొటోలు పోస్ట్‌ చేసిన ఫేస్‌బుక్‌ ఖాతా ఆధారంగా పోలీసులు ఎట్టకేలకు మణిని అరెస్ట్‌ చేశారు.

ఎవరికీ దొరక్కుండా పేరు విజయ్‌గా మార్చుకుని నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసి, ఆ తర్వాత చెన్నైలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని, అక్కడ పనిచేస్తున్న తోటి సిబ్బందితో సెల్ఫీ దిగి పోస్ట్‌ చేసి తమకు దొరికిపోయినట్లు పోలీసులు తెలిపారు.

English summary
An accused int attack case in Chennai has been nabbed by Chennai police with his selfie posted in facebook.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X