• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ట్విస్ట్: 'జగన్‌పై ప్రాణాపాయంలేని దాడి జోస్యం నిజమైంది, సీఎం చేయాలనే పిచ్చి అభిమానమే'

|

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఆదినారాయణ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదతర టీడీపీ నేతలతో పాటు నటుడు శివాజీ కూడా ఈ ఘటనపై స్పందించారు.

  శివాజీ చెప్పిందే జరిగిందా.. జగన్‌పై దాడి ‘గరుడ’ పనేనా ?

  జగన్‌పై దాడి తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ గమనిస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఆదినారాయణ రెడ్డిలు అన్నారు. దాడి జరిగిన సమాచారం అందిన వెంటనే సీఎం చంద్రబాబు డీజీపీతో మాట్లాడారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.

  కత్తికి విషం పూశారా? హత్యయత్నమే.. జగన్‌కు ఆ క్షణంలో తప్పిన ముప్పు: నిందితుడు ఏం చెప్పాడంటే?కత్తికి విషం పూశారా? హత్యయత్నమే.. జగన్‌కు ఆ క్షణంలో తప్పిన ముప్పు: నిందితుడు ఏం చెప్పాడంటే?

  జగన్‌పై ప్రాణాపాయం లేని దాడి గతంలోనే జోస్యం

  జగన్‌పై ప్రాణాపాయం లేని దాడి గతంలోనే జోస్యం

  దాడి తర్వాత తెలంగాణ మొదలు ఢిల్లీ వరకు రకరకాల వ్యక్తులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే దీని వెనక కుట్ర దాగి ఉందేమోనన్న అనుమానం కలుగుతోందని గంటా, ఆది అన్నారు. జగన్‌పై ప్రాణాపాయం లేని దాడి జరుగుతుందని కొద్ది రోజుల క్రితం నటుడు శివాజీ చెప్పారని, ఆపరేషన్‌ గరుడలో చెప్పిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా కళ్లకు కట్టినట్లు అమలవుతున్నాయన్నారు. కేంద్ర బలగాల అధీనంలో ఉండే విమానాశ్రయంలో జగన్‌పై దాడి జరిగిందని, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు ఆయనను ఆసుపత్రికి తరలించకుండా విమానంలో హైదరాబాదుకు పంపడం, గంట గడవకుండానే గవర్నర్‌ డీజీపీకి ఫోన్‌ చేసి ఆరా తీయడం ఏమిటన్నారు.

  టీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రకటనలు

  టీఆర్ఎస్, బీజేపీ నేతల ప్రకటనలు


  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా పలువురు తెరాస నేతలు, బీజేపీ నేతలు దాడిని తీవ్రంగా ఖండించడం, రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్ల పైకి పంపడం.. ఇవన్నీ చూస్తుంటే ఏదో కుట్ర ఉన్నట్లు అనుమానాలు కలుగుతోందని మంత్రులు అన్నారు. కేంద్ర బలగాల అధీనంలో ఉన్న చోట దాడి జరిగితే వైసీపీ నేతలు చంద్రబాబును విమర్శించడం ఏమిటన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుంటే జగన్‌ వందల రోజుల పాటు పాదయాత్ర చేసే వీలు ఉంటుందా అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి జగన్‌ అభిమానిగా గతంలో చెప్పుకున్నాడన్నారు.

  అల్లర్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక

  అల్లర్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక

  నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు దాడి తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ దర్యాప్తు చేస్తామని, ఈ ఘటనను సాకుగా చూపి రాష్ట్రంలో అల్లర్లకు పాల్పడితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని గంటా, ఆది హెచ్చరించారు. హత్యా రాజకీయాలు, దాడులు చేయించుకొని లబ్ధి పొందే అలవాటు వైసీపీ నేతలవేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ గరుడలో చెప్పినవన్నీ జరుగుతున్నాయన్నారు. మరోవైపు, జగన్‌పై దాడిని స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఖండించారు. ఇలాంటి దాడులు మంచివి కావన్నారు.

  జగన్‌ను సీఎం చేయాలనే పిచ్చితో దాడి

  జగన్‌ను సీఎం చేయాలనే పిచ్చితో దాడి

  అభిమానం అనేది ఎంత పిచ్చిస్థాయిలో వెళ్లిపోయిందో దాడి చేసిన శ్రీనివాస్‌ను చూస్తే తెలుస్తోందని బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న తపనతో సానుభూతి కల్పించే ప్రయత్నంగా ఈ దాడి కనిపిస్తోందని, అందరికీ అలాగే అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

  నిందితుడు శ్రీనివాస్ అదే చెప్పారా?

  నిందితుడు శ్రీనివాస్ అదే చెప్పారా?

  కాగా, నిందితుడు కూడా షాకింగ్ వ్యాఖ్యలు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పోలీసులు శ్రీనివాస్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. జగన్ పైన సానుభూతి వస్తుందన్న ఉద్దేశంతోనే తాను దాడికి పాల్పడ్డానని శ్రీనివాస్ చెప్పాడట. గత ఎన్నికల్లోనే జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి కావాల్సిందని, అలా కాకపోవడం వల్ల తాను మనస్తాపం చెందానని, దాడి చేస్తే ఆయనపై సానుభూతి పెరుగుతుందని భావించే అలా చేశానని శ్రీనివాస్ చెప్పాడని ప్రచారం సాగుతోంది. తమ కుటుంబమంతా వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానులమేనని తన వాంగ్మూలంలో చెప్పారట.

  English summary
  YSR Congress chief and leader of the Opposition in Andhra Pradesh Assembly YS Jagan Mohan Reddy suffered a minor injury when a man slashed at him with a small knife at Visakhapatnam airport on Thursday. The man, Janapalli Srinivas Rao, works as a waiter at a restaurant at the airport. The TDP has been alleging that the YSRCP and the BJP are hand in glove.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X