గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళపై హత్యాయత్నం: కామవాంఛ తీర్చలేదనే...

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: లైంగిక వాంఛను నిరాకరించిందన్న కారణంగానే వివాహితపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఫిరంగపురం మండలం మండలం వేమూలూరుపాడులో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన రమాదేవి అనే మహిళ ఎనిమిదేళ్ల క్రితం మునగపాడుకు చెందిన సయ్యద్ రఫీని ప్రేమ వివాహం చేసుకుని అనంతరం ముస్లిం సంప్రదాయం ప్రకారం రజియాగా పేరు మార్చుకుంది. వీరికి ఇద్దరు సంతానం.

ఆరు నెలలుగా మండల పరిధిలోని మునగపాడులో కాపురముంటూ భార్యాభర్తలిద్దరూ మేరిగపూడిలోని ఓ స్పిన్నింగ్‌లో మిల్లులో పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన షేక్ ఆదంషఫీ అనే వ్యక్తి రజియాను కొంతకాలంగా తన కామవాంఛ తీర్చాలంటూ వేధించసాగాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుఝామున 4 గంటల సమయంలో బహిర్భూమికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన రజియా ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన రజియాను చికిత్స నిమిత్తం 108 అంబులెన్సులో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

guntur map

భర్త సంపాదనకు తోడుగా తాను కూడా పనికి వెళుతూ కుటుంబానికి తన వంతు సహాయాన్ని అందిస్తుంది. భర్త కూడా ఆమెను అర్థం చేసుకొని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంపై కామాంధుడి కన్ను పడింది. కోరిక నెరవేర్చమని ఏడాదిగా ఇంటి వద్ద పని చేసే వద్ద వివిధ రూపాల్లో వేధిస్తూనే ఉన్నాడు. అయినా కొన్నాళ్లు సహనం వహించింది. నెల క్రితం ఇంట్లో చెప్పింది. భర్త కూడా ఈమెను అనకుండా పెద్దల సమక్షంలో ఆ కామాంధుడికి బుద్ది చెప్పించింది.

ఏడాదిగా ఊరులో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేసే ఆదాం షఫీ అనే యువకుడు తనతో అక్రమ సంబంధం పెట్టుకోవాలని రజియాను వేధిస్తున్నాడు. ఇంటి వద్ద, పని చేసే స్పిన్నింగ్‌ మిల్లులు వద్ద కూడా వేధింపులు ఎక్కువ కావడంతో నెల రోజుల క్రితం భర్తకు చెప్పింది. భర్త తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో పెద్దల చేత షఫీని మందలింప చేశారు. దీంతో వివాదం అక్కడితో సర్థుమణిగిందనుకున్నారు. కానీ షఫీ మనసులో తీరని కోరిక, ఆగ్రహంతో రజియాను అంతమోందించాలని నిర్ణయించుకున్నాడు.

English summary
A tractor driver Shafi has attenpted to kill a married woman, insisting sexual relation in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X