హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ ఆర్టిస్ట్‌తో సహజీనం, ఫ్రెండ్స్‌కి నగ్నచిత్రాలు మెయిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Man cheats artist in Hyderabad, arrested
హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరు చెప్పి, ఓ యువతితో సహజీవనం చేసిన వ్యక్తి.. ఆ తర్వాత ఆమె నగ్న చిత్రాలను దాదాపు రెండు వందల మందికి పంపిన సంఘటన హైదరాబాదులో జరిగింది. అతనిని బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం అప్పాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కొన్నాళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చాడు.

ముషీరాబాదులో ఉంటున్నాడు. అతనికి షేక్‌పేటలోని మహిళా వసతి గృహంలో ఉంటున్న 22 ఏళ్ల టీవీ ఆర్టిస్ట్ కమ్ బ్యూటిషియన్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం పది నెలల క్రితం జరిగింది. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను శ్రీకాంత్ నమ్మబలికాడు.

ఇద్దరు కలిసి మూడు నాలుగు నెలలు సహజీవనం చేశారు. కొద్ది రోజుల తర్వాత శ్రీకాంత్ ఆమెను భయపెట్టి నగ్నంగా ఫోటోలు తీశాడు. వాటిని తన మిత్రులకు, బాధిత యువతికి పరిచయం ఉన్న వారికి మెయిల్ చేయడం, ఫోన్లో పంపించడం చేశాడు. ఈ విషయం బాధితురాలికి ఆలస్యంగా తెలిసింది.

ఇటీవలే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు. కాగా, శ్రీకాంత్ ఆమె నగ్న చిత్రాలను దాదాపు రెండు వందల మందికి పంపినట్లుగా తేలింది. వారికి పోలీసులు ఫోన్ చేసి చిత్రాలను తీసేయాల్సిందిగా సూచిస్తున్నారు.

English summary
A Man cheats Television artist in Hyderabad, arrested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X