అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిండు ప్రాణం బలి: సకాలంలో స్పందించని సిబ్బంది, ఊపిరాడక రోగి మృతి

|
Google Oneindia TeluguNews

ఆరోగ్యం బాగోలేదని ఆస్పత్రికి వస్తే సిబ్బంది పట్టించుకోలేదు. ఓపీ రిజిష్టర్‌లో పేరు నమోదు చేశారు.. కానీ వార్డులోకి రానీయలేదు. దీంతో అతను ఊపిరాడక చనిపోయాడు. ఈ హృదయ విదారకర ఘటన అనంతపురం జిల్లా ఆస్పత్రిలో జరిగింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చెట్టంత మనిషి చనిపోయాడని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 man dead in anantapur due to health staff negligence

ధర్మవరానికి చెందిన రాజు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున దవాఖానకు తీసుకొచ్చారు. అయితే సిబ్బంది ఓపీ రిజిస్టర్‌లో పేరు రాసుకున్నారు. కానీ వార్డులోకి రానీయలేదు. దీంతో ఉదయం 3 గంటల నుంచి బయటే ఉండాల్సి వచ్చింది. చూడాలని కుటుంబసభ్యులు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయి.. చనిపోయాడు.

Recommended Video

AP CM Jagan Expanded His cabinet, New Minsiters Taken Oath At Rajabhavan

రాజుకు వెంటనే వైద్యం అందించి ఉంటే బతికేవాడు అని కుటుంబసభ్యులు చెబుతున్నారు. రాజు మృతిపై మీడియా వార్త ప్రసారం చేయడంతో.. మృతదేహాన్ని స్ట్రెచర్‌పై మార్చురీ గదికి తరలించారు. రోడ్డుపై ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. అనంత ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని పేర్కొన్నారు.

English summary
raju dead in anantapur government hospital due to health staff negligence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X