కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టపగలే హత్య: సోదరి అక్రమ సంబంధమే ప్రాణం తీసింది(పిక్చర్స్)

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో గురువారం పట్టపగలే జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి హత్య సంఘటలనపై వివరాలను వెల్లడించారు.

|
Google Oneindia TeluguNews

కడప: జిల్లాలోని ప్రొద్దుటూరులో గురువారం పట్టపగలే జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి హత్య సంఘటలనపై వివరాలను వెల్లడించారు.

జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతీప్రసాద్‌రెడ్డి(34) తనపై 2014లో నమోదైన ఒక కేసుకు సంబంధించి కోర్టు వాయిదాకు హాజరయ్యేందుకు ప్రొద్దుటూరు వచ్చారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యర్థులు ముందుగా అతనితో వాగ్వాదానికి దిగారు. గొడవ తీవ్రమై కత్తులు తీశారు. అతను అది చూసి పారిపోయే యత్నం చేశారు. జార్జి క్లబ్‌ సమీపం నుంచి టీబీ రోడ్డువైపు పరుగు తీయగా ప్రత్యర్థులు కత్తులు ధరించి ఆయన్ను వెంటపడ్డారు.

వివాహేతరబంధం: అంతా చూస్తుండగా పట్టపగలే నడిరోడ్డుపై నరికి చంపారు, వీడియో తీసి..వివాహేతరబంధం: అంతా చూస్తుండగా పట్టపగలే నడిరోడ్డుపై నరికి చంపారు, వీడియో తీసి..

మార్కెట్‌యార్డు సమీపానికి రాగానే అతను రోడ్డు మధ్యలో కింద పడిపోయారు. వెంటాడిన వారిలో ఒకరు అతన్ని కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. మరొకరు వేట కత్తితో అతి దారుణంగా తల, మెడ, కడపు భాగంలో పలుమార్లు నరికి హత్యమార్చాడు. ఆపై సమీపంలోని కాల్వలో హత్యకు ఉపయోగించిన కత్తిని పడేసి నడుచుకుంటూ వెళ్లి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. మారుతీ ప్రసాద్‌రెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందారు.

అక్రమ బంధమే

అక్రమ బంధమే

మారుతీప్రసాద్‌రెడ్డి హత్యకు అతని సోదరికి ఉన్న వివాహేతర సంబంధమే కారణమని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఈ విషయంలో మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయన్నారు.

చంద్రశేఖర్ రెడ్డితో వివాహేతర సంబంధం..

చంద్రశేఖర్ రెడ్డితో వివాహేతర సంబంధం..

మారుతీరెడ్డి హత్యకు ముఠాకక్షలు, ఫ్యాక్షన్‌, రాజకీయాలకు సంబంధం లేదని, కేవలం వివాహేతర సంబంధ కారణంగానే హత్య జరిగిందంటూ ఆయన స్పష్టం చేశారు. దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మారుతిరెడ్డి సోదరి అనురాధ ప్రొద్దుటూరు పట్టణంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది. అదేప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది.

కక్షలకు దారితీసిన బంధం

కక్షలకు దారితీసిన బంధం

జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామానికి చెందిన బోరెడ్డి మునిరెడ్డికి కూతురు అనూరాధ, కొడుకు మారుతీ ప్రసాద్‌రెడ్డి సంతానం. అనూరాధకు పెళ్లైంది. ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో తన భర్త ఇంటి వద్ద ఉంటూ అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేస్తున్నారు. మారుతీప్రసాద్‌రెడ్డి దేవగుడి గ్రామంలో తన తల్లి వద్ద ఉంటున్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి తరచూ అనూరాధ ఇంటి వద్దకు వెళ్లేవారు. ఈ క్రమంలో వీరికి వివాహేతర సంబంధం ఉందని భావించిన అనూరాధ తమ్ముడు మారుతీ ప్రసాద్‌రెడ్డి ఓ సారి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి అతని భార్య నిర్మలమ్మను బెదిరించారు.

బెదిరింపులు

బెదిరింపులు

ఈ క్రమంలో తన ఇంటికి వచ్చి తనను బెదిరించారంటూ నిర్మలమ్మ తాలూకా పోలీస్‌స్టేషన్‌లో మారుతీ ప్రసాద్‌రెడ్డిపై 2014లో ఫిర్యాదు చేశారు. దీంతో మారుతీప్రసాద్‌రెడ్డిపై అప్పట్లో బెదిరింపు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వారి మధ్య మనస్పర్థలున్నాయి. రెండు నెలల కిందట నిర్మలమ్మ బంధువులు రఘునాథరెడ్డి, పట్నం ధరణి, మడక వెంకటరమణ అనేవారు మారుతీ ప్రసాద్‌రెడ్డిని హతమార్చాలని కుట్ర పన్నారనే విషయం పోలీసులకు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి రిమాండుకు పంపారు.

పథకం ప్రకారమే

పథకం ప్రకారమే

కాగా, మే 19న బెయిల్‌పై వచ్చిన రఘునాథరెడ్డి, తదితరులకు ‘మీరు జైలులో ఉండగా ఎవరో తన ఇంటికి వచ్చి తలుపు తట్టారని, ఇది మారుతీ ప్రసాద్‌రెడ్డి పని అయి ఉండవచ్చ' అని నిర్మలమ్మ తెలిపారు. ఈ నేపథ్యంలో 2014లో నమోదైన కేసుకు సంబంధించి గురువారం నిర్మలమ్మతోపాటూ రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డి మరి కొందరు మరోవైపు మారుతీప్రసాద్‌రెడ్డి ప్రొద్దుటూరులోని కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు.

అందరూ చూస్తుండగానే..

అందరూ చూస్తుండగానే..

ముందుగానే కోర్టు వద్ద ఉన్న నిర్మలమ్మ, ఆమె బంధువులు రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డి దేవగుడి నుంచి ఆటోలో వచ్చిన మారుతీ ప్రసాద్‌రెడ్డితో ‘ఎందుకు నిర్మలమ్మ ఇంటికి వెళ్లి తలుపు తట్టావు' అని వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగి వెంట తెచ్చుకున్న అందరూ చూస్తుండగానే.. వేటకొడవలి, పిడిబాకుతో వెంటబడి మారుతీ ప్రసాద్‌రెడ్డిని కిరాతకంగా హత్య చేశారు. హత్యకు పాల్పడిన రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. హతుడి సోదరి అనూరాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘునాథరెడ్డి, శ్రీనివాసరెడ్డి మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు బాధ్య సి.ఐ. ఓబులేసు తెలిపారు.

సింగపూర్ నుంచి వచ్చి..

సింగపూర్ నుంచి వచ్చి..

దేవగుడికి చెందిన మారుతి ప్రసాద్‌రెడ్డి తండ్రి కొన్నేళ్ల కిందట మృతి చెందారు. తల్లి వెంకటలక్షుమ్మ ఒక్కతే దేవగుడిలోని తన ఇంట్లోనే ఉంటున్నారు. మూడు నెలల కిందట వెంకటలక్షుమ్మకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగడంతో సింగపూర్‌లో ఉన్న మారుతిరెడ్డి నెల రోజుల కిందట స్వగ్రామం దేవగుడికి వచ్చారు. ఇతనికి మూడేళ్ల కిందట విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. ప్రస్తుతం భార్యకు విడాకులిచ్చినట్లు బంధువులు తెలిపారు. ఇప్పుడు దేవగుడిలో మారుతి ప్రసాద్‌రెడ్డి తన తల్లి వెంకట లక్షుమ్మ వద్ద ఉంటున్నారు. గురువారం వాయిదాకు ప్రొద్దుటూరు కోర్టుకు రాగా ప్రత్యర్థులు అందరూ చూస్తుండగానే హతమార్చారు.

English summary
A 36-year-old was hacked to death in full public view at a market yard in Proddatur in Kadapa district of Andhra Pradesh on Thursday. The assailants repeatedly stabbed the man in the middle of the road as people watched in horror. Nobody came forward to save the victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X