వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని వాసి కిడ్నాప్..., క్రికెట్ బెట్టింగ్ కారణమా....?

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు: కిడ్నాపర్ల ద్రుష్టి అమరావతి పై పడింది. యువత పెడద్రోవన నడుస్తున్నారు. లక్షల్లో ఆర్ధిక లావాదేవీల మధ్య చిక్కుకుని లేనిపోని ప్రమాదాలు తెచుకుంటున్నారు. గుంటూరు జిల్లా అమరావతి లో ఆదివారం ఓ కిడ్నాప్ కేసు నమోదు అయింది. స్థానికం గా నివాసం ఉండే ఆనంద్ 30 సంవత్సరాల వ్యక్తి ఆదివారం ఉదయం నవ్యఆంధ్ర రాజధాని అమరావతిలో అదృశ్యం అయ్యాడు.

అయితే ఇతను ఎక్కడ ఉంది ఈ రోజు వరకు ఆచూకీ తెలియ రాలేదు. కట్ చేస్తే గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ఆచూకీ లభించింది. నిన్న ఉదయం అమరావతి కి ఓ కారు లో వచ్చిన వ్యక్తులు నమ్మకంగా ఆనందను బార్ కి తీసుకెళ్లారు. అక్కడ ఫ్యూటుగా మద్యం సేవించి ఆనంద్ ని అమరావతి నుండి ఎక్కడికో తీసుకెళ్లారు. అమరావతి లో మిస్సింగ్ కేసు నమోదు కాగా, పోలీసులకు భయపడిన కిడ్నాపర్ల్ ఆనంద్ ని వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు.

Man kidnapped from Amaravati,three nabbed

ఈ క్రమంలో సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ లో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా,ముగ్గురు యువకులు ఆనంద్ ని కారులో బంధించి తీసుకెళుతున్న విషయాన్ని పసి గొట్టారు. అప్పటికే పోలీసులకు ఉన్న సమాచారం మేరకు ఆరా తీస్తే కిడ్నాప్ అని తేలింది. కారుని నలుగురు వ్యక్తులను అడుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారణ చేయగా కిడ్నాపర్లు షేకు నాగులు మీరా వలి, మారాసు అశోక్, కుంటా యశ్వంత్ కుమార్ లని తేలింది.

అయితే ఆనంద్ వీరికి లక్షల్లో బకాయి ఉన్నాడని, డబ్బు రాబట్టుకునేందుకు తీసుకెళ్లామని పొలిసు విచారణ లో చెప్పారు. అసలు ఎందుకు ఆనంద్ డబ్బులు ఇవ్వాలి అనే విషయాన్ని పోలీసులు బయటకు చెప్పటం లేదు. యువత ఈ మధ్య క్రికెట్ బెట్టింగ్ లతో లక్షల లక్షల పందేలు కాస్తున్నారని బహుశా అదే కోవకు చెందిన కేసు అయ్యి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇక సత్తెనపల్లి పోలీసులు కేసు అమరావతి కి తరలించగా అమరావతి పోలీసులు దర్యాప్తు పనిలో ఉన్నారు. ముగ్గురు కిడ్నాపర్లను తమ అదుపులో ఉంచారు.

English summary
Three arrested for kidnapping a man from Andhra Pradesh capital Amaravati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X