వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో దారుణం: భార్యపై అనుమానంతో ఇద్దరు పిల్లల్ని చంపేశాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై ఉన్న అనుమానంతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన ఇద్దరు పిల్లలను అత్యంత దారుణంగా చంపి అనంతరం పోలీసులకు లొంగిపోయిన ఘటన విశాఖ జిల్లాలోని పాయరావుపేట మండలం నామవరం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పాలిక సత్తింపడు అలియాస్ సత్తిబాబు నిర్మల దంపతులు నాలుగేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నరు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. హనీప్రియ(మూడున్నర), కార్తీక్(ఏడాదిన్నర) వయసుతో ఉన్నారు.

ఇలా నాలుగేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో ఈ మధ్య కాలంలో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇందుకు కారణం సత్తిపండు తన భార్యపై అనుమానం పెంచుకోవడమేనని అంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.

Man killed his two children after surrender in police station

గొడవ అనంతరం భార్య ఇంటి పనుల్లో నిమగ్నమైన ఉండగా రాత్రి ఏడు గంటల సమయంలో సత్తిపండు తన ఇద్దరు పిల్లలను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం పాయకరావు పేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య:

అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెందిన కె.ఆర్‌.ఎం కాలనీకి చెందిన వివాహిత అంగుడి జగదీశ్వరి (28) ఆత్మహత్యకు పాల్పండింది. రెండు రోజుల కిత్రం పురుగుమందు తాగి అస్వస్థతకు గురికాగా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.

ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సి.ఐ విద్యాసాగర్‌ ఆధ్వర్యంలో ఎ.ఎస్‌.ఐ భీమ్‌నాయుడు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈమె కొంత కాలంగా మూర్చవ్యాధితో బాధపడుతోంది.

అనారోగ్యం కూడా వెంటాడుతుండటంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త రమేష్‌ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు.

English summary
Man killed his two children after surrender in police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X