కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెంచుకున్న ‘పిల్లి’ని చంపి తిన్నాడని అతి కిరాతకంగా చంపేశాడు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కర్నూలు: సభ్యసమాజంలో మానవ విలువలు మరింతగా తగ్గాయని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. పెంచుకున్న పిల్లిని చంపాడని ఓ వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన ఉదంతం కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసులో ఐదు నెలల తర్వాత మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసులు
వెల్లడించిన కథనం ప్రకారం పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన నల్లబోతుల చిన్న మహానంది రెండేళ్లుగా ఓ తెల్ల పిల్లిని తెచ్చుకొని పెంచుకుంటున్నాడు. ఆ పిల్లికి బుజ్జి అని పేరు పెట్టి కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు.

అయితే 'బుజ్జి' వచ్చినప్పటి నుంచి ఇంట్లో కోడిపిల్లలు ఒకదాని తర్వాత మరొకటి మాయం అవుతున్నాయి. ఇది పిల్లి పనేనని భార్య, పిల్లలు గుర్తించారు. దీంతో పిల్లిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని అనుకున్న భార్య ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఇంట్లో పిల్లిని సరిగిరి కడియం ఎల్లప్పకు ఇచ్చారు.

Man murdered for killing pet cat Kurnool District

దీంతో అతడు ఆ రాత్రికి పిల్లిని కూర వండుకొని తినేశాడు. దీంతో రాత్రి ఇంటికి వచ్చిన మహానంది విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులపై గొడవకు దిగాడు. అంతేకాదు ఎల్లప్ప ఇంటికి వెళ్లి అతడితో వాగ్వాదానికి దిగాడు.

సొంత బిడ్డలా పెంచుకుంటున్న పిల్లిని తీసుకెళ్తావా? అని ఆగ్రహంతో నిలదీసిన మహానంది అక్కడే ఉన్న మేరను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా, ఎల్లప్ప అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మరింత తారాస్థాయికి చేరుకుంది. దీంతో మహానంది తన చేతికి అందిన పదునైన రాయితో ఎల్లప్ప తలపై బలంగా కొట్టడంతో ఎల్లప్ప అక్కడికక్కడే మరణించాడు.

దీంతో మహానంది అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఎల్లప్ప కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఎల్లప్పని హత్య చేశారని తేలడంతో ఐదు నెలల తర్వాత మంగళవారం మహానందిని అరెస్ట్ చేశారు.

English summary
An unusual incident of crime has taken place at Lakshmapuram Village in Kurnool District and finally the police could catch the culprit named Chinna Mahanandi after search for five months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X