కూతురిపై తండ్రి అత్యాచారం, గర్భదాల్చిన బాధితురాలు

హైదరాబాద్: కన్నతండ్రే కీచకపాత్ర పోషించి కూతురి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించాడు. తెలంగాణ రాష్ట్రంలోని రంగా రెడ్డి జిల్లా మేడ్చెల్‌లో ఓ వ్యక్తి తన కన్నకూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కూతురు గర్భవతి కావడంతో విషయం వెలుగు చూసింది. అమ్మాయి తల్లి నిందితుడిపై పోలీసులు ఫిర్యాదు చేసింది.

ఇన్నోవా కారు దూసుకెళ్లి మహిళ మృతి

ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భక్తులపై ఇన్నోవా కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఈ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాళహస్తి ఆలయం సమీపంలో సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన వారు కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచరాం. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Man rapes daughter in Rangareddy district

ప్రేమ విఫలమై ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టు సమీపంలోని మత్స్యగడ్డలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రేమ విఫలం కావడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ముంచంగిపుట్టు నాలుగు రోడ్ల కూడలిలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.

నాటు తుపాకుల స్వాధీనం

గుంటూరు జిల్లాలోని శావల్యాపురం దగ్గర నాటు తుపాకులు కలకలం రేపుతున్నాయి. ఓ కారులో తరలిస్తున్న రెండు నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సందీప్‌, మంగళగిరికి చెందిన మురళీ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే వీరిని రహస్యంగా కోర్టులో హాజరుపర్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వృద్ధురాలి హత్య కేసులో నిందితుడి అరెస్టు

కృష్ణా జిల్లాలోని గుణదలలో వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం మాధురీదేవి అనే వృద్ధురాలిపై దుండగులు దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న నగదును దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో వీరి నివాసంలో కార్‌పెంటర్‌గా పనిచేసిన అజీజ్‌ అక్కడి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు షాపులవల్లూరులో అజీజ్‌ ఉన్నట్లు సమాచారం అందటంతో వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+