• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫేస్‌బుక్‌లో యువతులకు అశ్లీల ఫోటోలు పెట్టి అడ్డంగా దొరికిన ప్రొఫెసర్

By Srinivas
|

కాకినాడ: ఓ ప్రొపెసర్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా యువతులకు అశ్లీల చిత్రాలు, అసభ్య సందేశాలు పంపిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న నరేష్ తప్పుడు ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. దాని నుంచి అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకుని, ఆపై అసభ్య మెసేజ్‌లు చిత్రాలు పంపుతూ వేధించేవాడు. దీనిపై పెనుగొండకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Man uploading obscene Photos on Facebook, Arrested

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నరేష్ గుంటూరు జిల్లా రేపల్లెకు చెందినవాడు. పెనుగొండ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి, అతనిని శనివారం నాడు అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

అంతర్వేదిలో గ్యాస్‌ లీకేజి

అంతర్వేదిలోని 28వ ఓఎన్‌జీసీ బావి పైప్‌లైన్‌ నుంచి ఆదివారం గ్యాస్‌ లీకేజీ అయింది. స్థానికులు వెంటనే గుర్తించి మోరీ జీసీఎస్‌ అధికారులకు సమాచారం అందించారు.

సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. అయితే శనివారం కూడా ఇదే ప్రాంతంలో గ్యాస్‌ లీకవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఓఎన్‌జీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్యాస్‌ లీకేజీ అదుపులోకి వచ్చింది.

English summary
Man uploading obscene Photos on Facebook, Arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X