హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిగ్ ఎఫ్ఎంలో మనోజ్: ఆర్జేలకు కొమ్ములు..(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో టాలీవుడ్ కథానాయకుడు మంచు మనోజ్ ఆదివారం సందడి చేశారు. ఇండియా రేడియో ఫోరమ్(ఐఎఫ్ఆర్) అవార్డులు సాధించిన బిగ్ ఎఫ్ఎం రేడియో జాకీలను అభినందించటానికి బేగంపేటలోని ఆ రేడియో స్టేషన్‌కు వచ్చారు మనోజ్. హ్యాపీ మార్నింగ్‌కి ఆర్‌జె శేఖర్, ఫుల్ వాల్యూమ్‌కి ఆర్‌జె జోకీ ఇండియా రేడియో ఫారమ్ 2014 బెస్ట్ ప్రోగ్రామ్ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను వారు ప్రదర్శించారు.

అంతేగాక ఆర్‌జె శేఖర్‌కు తెలుగులో ‘ఆర్‌జె ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా పొందారు. ఈ నేపథ్యంలో ఆదివారం మంచు మనోజ్ బిగ్ ఎఫ్ఎం కార్యాలయానికి వచ్చి ఆర్‌జేలను అభినందించారు. అంతే కాకుండా వీరికి కొమ్ములు వచ్చాయి అంటూ కొమ్ములు కూడా తొడిగారు. ఈ సందర్భంగా ఆర్‌జె జో మాట్లాడుతూ.. 92.7 బిగ్ ఎఫ్ఎం ఆర్జేగా 7వ సంవత్సరం అని, ఫుల్ వాల్యూమ్ ప్రోగ్రాం ప్రారంభమైన మూడు నెలలకే ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించడంతోపాటు అవార్డు కూడా సాధించి పెట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

అవార్డు రావడం ఎంతో గర్వించదగ్గ సందర్భమని, వరుసగా ఏడవసారి తనకు అవార్డు లభించిందని, శ్రోతలకు మంచి కార్యక్రమాలను అందించేందుకు తపించే 92.7 బిగ్ ఎఫ్ఎంలో భాగమైనందుకు గర్వంగా ఉందని ఆర్జే శేఖర్ అన్నారు. తాము సాధించిన ఈ విజయాన్ని శ్రోతలతో కూడా వారివద్దకు ‘మీకు కొమ్ములున్నాయా?' అనే ప్రత్యేక క్యాంపెయిన్ ద్వారా కొద్ది రోజుల్లో వెళ్లి పంచుకుంటారని, ఈ కార్యక్రమంలో భాగంగా శ్రోతలు వారు వారి జీవితంలోని గర్వించదగ్గ క్షణాలను పంచుకుంటారని తెలిపారు.

మంచు మనోజ్

మంచు మనోజ్

హైదరాబాద్ నగరంలో టాలీవుడ్ కథానాయకుడు మంచు మనోజ్ ఆదివారం సందడి చేశారు.

మంచు మనోజ్

మంచు మనోజ్

ఇండియా రేడియో ఫోరమ్ అవార్డులు సాధించిన బిగ్ ఎఫ్ఎం రేడియో జాకీలను అభినందించటానికి బేగంపేటలోని ఆ రేడియో స్టేషన్‌కు వచ్చారు మనోజ్.

మంచు మనోజ్

మంచు మనోజ్

హ్యాపీ మార్నింగ్‌కి ఆర్‌జె శేఖర్, ఫుల్ వాల్యూమ్‌కి ఆర్‌జె జోకీ ఇండియా రేడియో ఫారమ్ 2014 బెస్ట్ ప్రోగ్రామ్ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను వారు ప్రదర్శించారు. అంతేగాక ఆర్‌జె శేఖర్‌కు తెలుగులో ‘ఆర్‌జె ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా పొందారు.

మంచు మనోజ్

మంచు మనోజ్

అవార్డు రావడం ఎంతో గర్వించదగ్గ సందర్భమని, వరుసగా ఏడవసారి తనకు అవార్డు లభించిందని, శ్రోతలకు మంచి కార్యక్రమాలను అందించేందుకు తపించే 92.7 బిగ్ ఎఫ్ఎంలో భాగమైనందుకు గర్వంగా ఉందని ఆర్జే శేఖర్ అన్నారు.

మంచు మనోజ్

మంచు మనోజ్

ఈ సందర్భంగా ఆర్‌జె జో మాట్లాడుతూ.. 92.7 బిగ్ ఎఫ్ఎం ఆర్జేగా 7వ సంవత్సరం అని, ఫుల్ వాల్యూమ్ ప్రోగ్రాం ప్రారంభమైన మూడు నెలలకే ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించడంతోపాటు అవార్డు కూడా సాధించి పెట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు.

మంచు మనోజ్

మంచు మనోజ్

ఆదివారం మంచు మనోజ్ బిగ్ ఎఫ్ఎం కార్యాలయానికి వచ్చి ఆర్‌జేలను అభినందించారు. అంతే కాకుండా వీరికి కొమ్ములు వచ్చాయి అంటూ కొమ్ములు కూడా తొడిగారు.

English summary
Tollywood actor Manchu Manoj was present at the trophy display of IRF 2014 at the Hyderabad studio of 92.7 BIG FM while he congratulated the two brilliant RJ’s and crowned them with ‘horns’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X