వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ రౌడీల పనే: మందకృష్ణ, చీలిపోయాం: గాదె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: ఎపిఎన్జీవోలు నిర్వహించిన సభ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన రౌడీలు తెలంగాణ ఉద్యమకారుల పైన దాడులు చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం ఆరోపించారు. ఆయన కరీంనగర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను లూటీ చేయడానికే కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌ను యూటి చేస్తే ఇక యుద్ధమేనన్నారు. హైదరాబాద్‌ను యూటి కాకుండా చూసుకోవడం, తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయడానికి తెలంగాణవాదులందరి కర్తవ్యంగా ఉద్యమాలను కొనసాగించాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఎమ్మార్పీఎస్ సీమాంధ్రలో మద్దతు కోసం తనవంతు బాధ్యత నిర్వర్తిస్తుందన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చూసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

సమైక్యాంధ్ర ఉండాలని కోరుకుంటున్న వారి అంతిమ లక్ష్యం హైదరాబాద్‌ను యూటి చేయడమేనని విమర్శించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల గల సీమాంద్రుల అక్రమాస్తులను కాపాడుకోవడానికే యూటి అంటున్నారని తెలిపారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఇవ్వడమంటే తల లేని మొండాన్ని, గుండె లేని మనిషిని అప్పగించినట్లేనన్నారు. యూటి చేస్తే యుద్ధమేననే నినాదంతో ఈనెల 21న లక్ష మంది విద్యార్థులతో చలో హైదరాబాద్ ఓయూ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

ఏకాభిప్రాయంపై గాదె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం లభించిందన్న కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి గుంటూరులో అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ రెండుగా చీలిందన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తొలి నుంచి సమైక్యమంటున్నారని, మజ్లిస్, సిపిఎం సమైక్యవాదాన్ని బలంగా వినిపించాయన్నారు.

English summary
MRPS chief Manda Krishna Madiga on Thursday blamed YSR Congress Party for attacking Telanganites on September 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X