వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ తెలంగాణదే, కాదంటే మట్టి: మందకృష్ణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, దాన్ని తెలంగాణ నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెసు పార్టీ మట్టి కొట్టుకుని పోతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక నేత మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన శనివారంనాడు బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని కలిశారు. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర పెట్టుబడిదారులు పావులు కదుపుతున్నారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

సీమాంధ్ర పెట్టుబడిదారులకు కేంద్రం తలొగ్గుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయని, హైదరాబాద్ విషయంలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనే దానికి ఉదాహరణ అని ఆయన అన్నారు. హైదరాబాదుపై రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని సుశీల్ కుమార్ షిండే అనడాన్ని ఆయన తప్పు పట్టారు. హైదరాబాదును తెలంగాణనుంచి వేరు చేయాలని చూస్తే సహించబోమని ఆయన అన్నారు.

తెలంగాణ భూములను అక్రమంగా కబ్జా చేసినవారికి హైదరాబాదులో రక్షణ కల్పించడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. హైదరాబాదు లేకపోతే తెలంగాణ ప్రజలు అవమానానికి గురవుతారని, హైదరాబాదును తెలంగాణకు దక్కకుండా చేయడం వల్ల సీమాంధ్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.

తెలంగాణపై బిజెపి ఒక్క ప్రకటన చేస్తే విశేషంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. సమైక్య ఉద్యమానికి ప్రభుత్వం తలొగ్గుతున్నట్లు సంకేతాలు అందుతన్న సమయంలో తెలంగాణ కోసం బిజెపి ఒత్తిడి పెంచాలని ఆయన అన్నారు. ఎపిఎన్జీవోల సభ హైదరాబాదుపై దాడి చేసే విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎపి ఎన్జీవోల సభలో రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేశారని, తెలంగాణవారిపై దాడులు చేశారని ఆయన విమర్శించారు. సమైక్యవాదులు వారికి మాత్రమే స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నారని, సమైక్యంగా ఉంచాలని కోరుకునే హక్కు తమకు ఉంది గానీ ఇతరులకు చిన్న రాష్ట్రాలను కోరుకునే హక్కు లేదనే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

English summary
MRPS founder Manda Krishna Madiga said that Hyderabad is the integral part of Telangana, it can not be separated from Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X