వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు అంత టైమా: సోమిరెడ్డి, అలవాటే: మందకృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Krishna and Somireddy fire at KCR
హైదరాబాద్/నెల్లూరు: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలు వేరువేరుగా మండిపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

అన్ని పార్టీలకు అరగంట సమయం ఇచ్చిన మంత్రుల బృందం(జివోఎం) తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో గంట పాటు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సోమశిల, తెలుగు గంగ ప్రాజెక్టుల పైన కెసిఆర్ వ్యాఖ్యలు విడ్డూరమన్నారు. వాటి గురించి తెలియాలంటే పైనున్న ఇందిరా గాంధీ, జలగం వెంగళ రావులను అడగాలన్నారు. పది పదిహేను నిమిషాల్లో సీమాంధ్రుల భవిష్యత్తును తేల్చుతారా అని ఆగ్రహించారు. అఖిల పక్షం కేవలం తూతూమంత్రమే అన్నారు.

ఇంత అన్యాయమా?: కోడెల

కాంగ్రెసు పార్టీ విభజనను బలవంతంగా ముందుకు తీసుకు వెళ్తూ సంప్రదాయాలు, చట్టాలు, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కేసిందని టిడిపి మరో నేత కోడెల శివప్రసాద్ గుంటూరులో అన్నారు. అన్ని పక్షాలను ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడాలన్నారు. ఉద్యోగులకు ఇంటర్వ్యూల్లా ఇతర పార్టీల వాదనలు వినడం దారుణమన్నారు. కాంగ్రెసు అధిష్టానాన్ని కట్టడి చేయాల్సిందిగా రాష్ట్రపతికి టిడిపి తరఫున లేఖ రాస్తామన్నారు.

కెసిఆర్‌కు అలవాటే: మందకృష్ణ

ప్యాకేజీల కోసం తెలంగాణపై ఆంక్షలకు కెసిఆర్ అంగీకరించే అవకాశం ఉందని, రహస్య ఒప్పందాలు చేసుకోవడం ఆయనకు అలవాటేనని హైదరాబాదులో మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాదుపై కేంద్రం ఆంక్షలు విధిస్తే కొడుకు కెటిఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావుల కోసం ఒప్పుకుంటారనే ఓ విధమైన ఆందోళన తనకు ఉందన్నారు. సిఎం పదవి ఇస్తే ఎలాంటి ఆంక్షలనైనా ఒప్పుకుంటాననే రీతిలో తెలంగాణ కాంగ్రెసు నేతలు ఉన్నారన్నారు.

English summary
MRPS chief Manda Krishna Madiga and TDP leader Somireddy Chandramohan Reddy on Wednesday fired at TRS chief K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X