వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొన్న ది బెస్ట్ సీఎం అన్నారు.. ఇప్పుడు చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు అంటున్నారు .. మందా కృష్ణ మాయ

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా ఏపీలో బాధ్యతలు చేపట్టిన జగన్ కేసీఆర్ కంటే వెయ్యి రెట్లు నయమని వైసీపీ అధికారంలోకి రాగానే చెప్పిన మందా కృష్ణ ఇప్పుడు జగన్ ను తిట్టిపోస్తున్నారు. ఏపీ సీఎం జగన్ అనుభవం లేకున్నా మెరుగ్గా పని చేస్తున్నారన్న మందా కృష్ణ మాదిగ ఇప్పుడు ఆయనకు చురకలు అంటిస్తున్నారు.

కేశినేని ట్రావెల్స్ పై కోర్టుకెక్కిన సిబ్బంది.. కేశినేని కొత్త కష్టాలకు కారణం ఇదేనా ?కేశినేని ట్రావెల్స్ పై కోర్టుకెక్కిన సిబ్బంది.. కేశినేని కొత్త కష్టాలకు కారణం ఇదేనా ?

పొగిడిన నోటితోనే విమర్శలు .. జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీ ముట్టడిస్తామంటున్న మందా కృష్ణ మాదిగ

పొగిడిన నోటితోనే విమర్శలు .. జగన్ వ్యాఖ్యలపై అసెంబ్లీ ముట్టడిస్తామంటున్న మందా కృష్ణ మాదిగ

అప్పుల రాష్ట్రంగా, మొదటి నుండి లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న ఏపీలో సీఎం జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ది బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారన్న ఆయన , మంత్రివర్గంలో ఎస్సీలకు , మహిళలకు సముచిత స్థానం ఇచ్చారని కొనియాడిన కృష్ణ మాదిగ ఇప్పుడు చంద్రబాబుకు జగన్ కు ఏ మాత్రం తేడా లేదని మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేతగా మూడువేల కి.మీ పాదయాత్ర చేసిన జగన్ సీఎం అయిన తర్వాత తమకు 36 కి.మీ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం చాలా దారుణమని మందా కృష్ణ మాదిగ విమర్శించారు. కృష్ణా జిల్లా నందిగామలో జగన్ మీద పొగడ్తల వర్షం కురిపించి రెండు నెలలైనా కాకముందే జగన్ పై విమర్శల అస్త్రాన్ని ఎక్కు పెట్టారు మందా కృష్ణ . జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకున్నారు.

 ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ మాట్లాడటంపై ఫైర్ అయిన మందా కృష్ణ

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ మాట్లాడటంపై ఫైర్ అయిన మందా కృష్ణ


ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై వైసిపి ప్ర‌భుత్వ వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టం చేయాల‌ని ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మందా కృష్ణ మాదిగ సీఎం జ‌గ‌న్ కు అల్టిమేటం ఇచ్చారు... 24 గంట‌ల‌లోగా ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌క‌పోతే 48 గంట‌ల‌లో వైసిపి ప్ర‌భుత్వంపై త‌మ వైఖ‌రి ఏమిటో తేల్చిచెబుతామ‌ని స్ప‌ష్టం చేశారు.ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో జగన్ మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్టు జగన్ చెప్పారని గుర్తు చేశారు. వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడలేదనే విషయాన్ని బైబిల్ పై ప్రమాణం చేసి చెప్పగలరా అని జ‌గ‌న్ ను సూటి ప్రశ్న వేశారు మందా కృష్ణ . మాట తప్పం, మడమ తిప్పం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. దివంగత వైయస్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారంటూ ఆయన విమర్శించారు. వైసీపీ గెలుపు కోసం మాదిగలు కృషి చేసింది నిజం కాదా? అని అడిగారు మందా..ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ చిలుక పలుకులు పలికాడని మందకృష్ణ మాదిగ జగన్ ను విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.

ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ముట్టడిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరిక

ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ముట్టడిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరిక


ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్దమని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలని మందకృష్ణ మాదిగ కోరారు. ఈ వ్యాఖ్యలను విరమించుకోవాలని గాంధేయ పద్దతిలో ఈ నెల 20న గుంటూరు నుండి అసెంబ్లీ వరకు యాత్ర తలపెట్టినట్టుగా మందకృష్ణ చెప్పారు.ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ముట్టడిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగను అరెస్ట్ చేయడాన్ని మందకృష్ణ మాదిగ తప్పుబట్టారు.అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు కూడ ఇదే పని చేశాడని మాట్లాడిన మందా కృష్ణ మాదిగ అందుకే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపారని గుర్తు చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్‌కు కూడ పడుతోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు .

English summary
Mandakrishna asked jagan to immediately withdraw CM Jagan's comments about the SC classification is against the constitution. Mr. Mandakrishna said that the Gandhian process was to travel from Guntur to the assembly on the 20th of this month .He was seriously opposing for not giving the police permission for this walk. Mandakrishna Madiga has warned that the Andhra Pradesh Assembly will be invaded on the 30th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X