వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్ 3న ఫిరాయించిన ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ విచారణ, సునీత, శివనాథరెడ్డికి కార్యదర్శి లేఖ...

|
Google Oneindia TeluguNews

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ జూన్ 3న విచారణ జరుగనుంది. ఈ మేరకు శాసనపరిషత్ కార్యదర్శి శుక్రవారం తెలిపారు. పార్టీ విప్ ఉల్లంఘించినందున శివనాథరెడ్డి, పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. మండలిలో పలు బిల్లులపై విప్‌కు విరుద్ధంగా ఓటు వేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫిర్యాదుపై మండలి కార్యదర్శి స్పందించారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపడుతామని తెలిపారు. మండలి ఛైర్మన్ ఛాంబర్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని, ఎందుకు అనుకూలంగా వ్యవహరించాల్సి వచ్చిందో వాదనలు వినిపించాలని ఎమ్మెల్సీలకు స్పష్టంచేశారు. ఈ మేరకు వారికి మండలి కార్యదర్శి లేఖ రాశారు.

 mandali secretary writes letter to two mlcs

Recommended Video

China Rejects Trump's Offer To Mediate Border Dispute With India

ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో విప్‌ని ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, కడప జిల్లాకు చెందిన శివనాథరెడ్డి జనవరి నెలలో జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. శివనాథరెడ్డి మొదటిసారి ఓటింగ్‌లో ప్రభుత్వానికి అనకూలంగా నిలబడ్డారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు శివనాథరెడ్డి. తమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అందుకే పార్టీ మారామని సునీత తెలిపారు. అయితే ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి అనుకూలంగా ఓటేయడంతో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండలి కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్యదర్శి స్పందించి.. లేఖ రాశారు.

English summary
andhra pradesh mandali secretary writes letter to two mlcs for Defective law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X