అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి శంకుస్థాపన జరిగే ప్రాంతం గుర్తింపు, ముగ్గురు ప్రధానుల విడిది అక్కడే..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోడీ చేతల మీదగా అక్టోబర్ 22న దసరా రోజున రాజధానికి శంకుస్థాపన జరగనున్న సంగతి తెలిసిందే.

రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని అంగీకరించడంతో పాటు, సింగపూర్, జపాన్ ప్రధానులు కూడా హాజరుకానున్నారు. తుళ్లూరు మండలానికి ఈశాన్య ప్రాంతంలో మందడం-వెంకటపాలెం గ్రామల మధ్యలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని తెలిసింది.

జూన్ 6న జరిగిన రాజధాని భూమి పూజకు స్ధల నిర్ణయం చేసిన రాఘవయ్యే సిద్ధాంతే శంకుస్ధాపన కార్యక్రమం నిర్వహించే స్థలాన్ని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన కూడా స్ధానిక అధికారులతో కలిసి స్థలాన్వేషణ కార్యక్రంలో పాల్గొన్నారు.

Mandam and Venkatapalem gets ready for amaravati foundation

మందడం-వెంకటపాలెం గ్రామాల మధ్య ఉన్న పొలిమేర ప్రాంతం శంకుస్థాపనకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు తెలిసింది. శంకుస్థాపనకు సంబంధించి తుది నిర్ణయం జిల్లా కలెక్టరు తుది నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు రాజధాని శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్ 22న మధ్యాహ్నాం 12 గంటలు దాటాకే ఉంటుందని సమాచారం.

రాజ
ధాని అమరావతి అంకురార్పణ కార్యక్రమం చిరస్థాయిగా నిలిచపోయేలా ఉండే విధంగా భారీ పైలాన్‌ను ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ-అమరావతి కరకట్ట పక్కనే ఉన్న విజయవాడ పీడబ్లూడీ వర్క్ షాపు నుంచి 6.2 కిలోమీటర్ల దూరంలో పైలాన్ ఏర్పాటవుతుందని తెలిసింది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ముగ్గురు ప్రధానులతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరవనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు విచ్చేయనున్న వీవీఐపీలకు గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం అతిథి గృహం విడిదిగా మారనున్నది.

సింగపూర్‌, జపాన్‌, భారత్‌ ప్రధానులు రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నట్లు సెక్రటేరియట్‌లోని ప్రొటోకాల్‌ విభాగం నుంచి కలెక్టరేట్‌కు సమాచారం అందింది. ముగ్గురు ప్రధానులతో పాటు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, సుమారు 15 మంది కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు.

జడ్‌, జడ్‌ ప్లస్‌ కేటగిరీ నాయకులు సుమారు 30-40 మంది వస్తారనే సమచారం అందింది. దీంతో గుంటూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని ఆధునీకరిస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 3-4 రోజుల నుంచి చురుగ్గా పనులు సాగుతున్నాయి.

ముందుగా ప్రధాని మోడీ నేరుగా గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుని ఇక్కడ నుంచి రాజధాని భూమి పూజ ప్రాంతానికి వెళ్తారని అధికారులకు సమాచారం అందింది. రాజధాని అమరావతి 2016 ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాల కోసం ఆధునిక సౌకర్యాలతో అతిథి గృహాన్ని ఆర్‌ అండ్‌బీ అధికారులు తీర్చి దిద్దుతున్నారు.

English summary
Mandam and Venkatapalem gets ready for amaravati foundation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X