వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంగ‌వీటి రాధాకు షాక్‌: అడ్డుకున్న కాపు యువ‌త..నిల‌దీత‌ : టిడిపి లో ఎలా చేరుతావు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : వంగ‌వీటి రాధాకు షాక్‌ : అడ్డుకున్న యువ‌త..!! || Oneindia Telugu

వంగ‌వీటి రాధాకు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. వైసిపి ని వీడి టిడిపిలో చేరి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్న రాధా ను కొంత మంది యువ‌త నిల‌దీసారు. టిడిపిలో ఎలా చేరుతావు అంటూ అడ్డుకున్నారు. పోలీసుల రంగ ప్ర‌వేశం తో ఆయ‌న హాజ‌రైన రోడ్ షో ముందుకు సాగింది. త‌న పై కోపం ఉన్నా..త‌న తండ్రి పై అభిమానం మాత్రం త‌గ్గ‌నీయ‌ద్ద‌ని రాధా వారికి విజ్క్ష‌ప్తి చేసారు.

రాధాకృష్ణ గో బ్యాక్..

రాధాకృష్ణ గో బ్యాక్..

వంగ‌వీటి రాధాకు తూర్పు గోదావ‌రి జిల్లా మండ‌పేట మండ‌లం కేశ‌వరంలో అనూహ్య ప‌రిణామం ఎదురైంది. మండ‌పే ట అసెంబ్లీ అభ్య‌ర్ది ..సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావుకు మ‌ద్ద‌తుగా ఆ గ్రామంలో రాధా ప్ర‌చారానికి వ‌చ్చారు. ఆ స‌మ‌యంలో అక్క‌డ గ్రామంలోని యువ‌త ఆయ‌న‌ను అడ్డుకున్నారు. రాధాకృష్ణ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదా లు చేసారు. దీంతో..అక్క‌డ పోలీసులు రంగ ప్ర‌వేశం చేసారు. ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని అడ్డుకోవ‌టం స‌రి కాద‌ని నినాదా లు చేస్తున్న యువ‌త‌కు స‌ర్ది చెప్పారు. దీంతో..వారు శాంతించారు. అయితే, రాధా త‌మ గ్రామానికి వ‌స్తున్న విష‌యం తెలుసుకున్న స్థానికులు అక్క‌డికి చేరుకొని ప్ర‌చార కాన్వాయ్ ను అడ్డుకున్నారు. రాధా పై ప్ర‌శ్న‌లు సంధించారు. యువ‌త రాధాను నిల‌దీసారు.

టిడిపి కి ఎలా మ‌ద్ద‌తిస్తావు..

టిడిపి కి ఎలా మ‌ద్ద‌తిస్తావు..

స్థానికంగా ఉన్న కాపు వ‌ర్గీయులు రాధా ప్ర‌చార వాహ‌నం వ‌ద్ద‌కు చేరుకున్నారు. తండ్రిని చంపిన పార్టీలో చేరి..ఆ పార్టీ కి మ‌ద్ద‌తుగా ఎలా ప్ర‌చారం చేస్తున్నావంటూ నిల‌దీసారుద‌. గో బ్యాక్ అంటూ నినాదాలు చేసారు. రాధా చాలాసేపు వారి కి న‌చ్చ చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. వారిని ప‌క్క‌కు తీసుకెళ్లేందుకు స్థానిక పోలీసులు ప్ర‌య‌త్నాలు చేసినా..వారు త‌మ నినాదాల‌ను కొన‌సాగించారు. ఆ త‌రువాత పోలీసు ఉన్న‌తాధికారులు న‌చ్చ చెప్పటం తో వారు శాంతించారు. ఆ త‌రు వాత రాధాను అక్క‌డి నుండి రాజ‌మండ్రికి పంపించారు. అయితే, రాధా ప్ర‌చారం ద్వారా కాపు సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను ఆక‌ర్షించాల‌నే టిడిపి ప్ర‌య‌త్నాల‌కు ఊహించ‌ని విధంగా నిర‌స‌న వ్య‌క్తం అయింది. కాపు వ‌ర్గానికే చెందిన వారుగా చెబుతున్న స్థానికులే రాధాను అడ్డుకోవ‌టంతో స్థానిక టిడిపి నేత‌ల్లో ఆందోళ‌న మొద‌లైంది.

నా పైన ద్వేషం ఉన్నా..రంగా మీద మాత్రం..

నా పైన ద్వేషం ఉన్నా..రంగా మీద మాత్రం..

స్థానికుల నుండి వ‌చ్చిన నిర‌స‌న తో ఒక్క సారిగా షాక్ తిన్న రాధా వారిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసారు. మీరంతా నా
మీద ఎంత ద్వేషం పెంచుకున్నా ఫర్వాలేదని, అంతే ప్రేమ, ఆప్యాయత, అనురాగం రంగా మీద చూపించాలని, అది తనకు చాలని రాధా పేర్కొన్నారు. అయితే, తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు సామాజిక వ‌ర్గం ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను శాసిం చే స్థాయిలో ఉంది. అదే జిల్లాలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభ‌వం ప్ర‌భావం ఉంది. అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యా న్ అభిమానులు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. దీంతో..అక్క‌డ వంగ‌వీటి రాధాను ప్ర‌చారంలో దించ‌టం ద్వారా ఆ వ‌ర్గ ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకోవ‌చ్చ‌ని టిడిపి నేత‌లు భావించారు. తాజాగా జ‌రిగిన ప‌రిణామంతో టిడిపి నేత‌ల్లో క‌ల‌వ‌రం మొదలైంది. దీంతో..ఇప్పుడు ఈ సామాజిక వ‌ర్గ ఓట్లు ఎటువైపు అనే చ‌ర్చ మొద‌లైంది.

English summary
Vangaveeti Radha faced protest by youth in Mandapeta election campaign. Kapu youth questioned Radha why supporting TDP. They given slogans go Back Radha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X