వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సాక్షి మీడియాపై ఈసికి మండవ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రిక, ఛానల్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా వస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా గుర్తించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వర రావు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. సాక్షి మీడియాపై ఆయన మంగళవారం ఈసికి ఫిర్యాదు చేశారు.

ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారని గుర్తు చేస్తూ అదే విధంగా సాక్షి పత్రిక, టీవీ ఛానల్లో వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోను తొలగించాలని ఆయన ఈసీని కోరారు. ఆళ్లగడ్డ ఎన్నికలపై ఈసీ వైఖరి తమకు అర్థం కావడం లేదని మండవ అన్నారు.

Mandava urges to consider Sakshi news as paid articles

ఇదిలా వుంటే, గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మంచి నీరు లభించకపోయినా కాలువల్లో మద్యం ఏరులై పారుతోందని తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కంపెనీలోనే మద్యం డంప్ బయటపడిందని ఆయన అన్నారు.

నకిలీ మద్యం భారీగా పట్టుబడినా రావి వెంకరమణ పై చర్యలు తీసుకోడానికి ఆబ్కారీ అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు.

English summary
Telugudesam party leader Mandava Venkateswar Rao comlained to EC against YSR Congress party president YS Jagan's Sakshi media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X