విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేష్ పనికిమాలిన దద్దమ్మ, ఓటుకు నోటు కారణంగానే, కావాలంటే బాబు ఇంట్లో అంట్లుతోముకో: ఆళ్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: డీఎస్పీ దుర్గాప్రసాద్‌కు తాను బినామీని కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి తెలిపారు. డీఎస్పీ దుర్గాప్రసాద్ నుంచి చట్టబద్దంగానే తాను ఆస్తులను కొనుగోలు చేశానని చెప్పారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల లూటీలను న్యాయస్థానాలలో నిరూపించానని చెప్పారు.

వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి:ఎట్టకేలకు ఎసిబి ముందుకు...! వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి:ఎట్టకేలకు ఎసిబి ముందుకు...!

అందుకే నాపై కక్ష సాధింపు చర్యలు

అందుకే నాపై కక్ష సాధింపు చర్యలు

అందుకే తన పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని రామకృష్ణా రెడ్డి చెప్పారు. నారా లోకేష్ పనికిమాలిన దద్దమ్మ అని మండిపడ్డారు. రాజావాసిరెడ్డి ఇచ్చిన భూములను కొట్టేయాలని లోకేష్ ప్రయత్నాలు చేస్తే అడ్డుకున్నానని రామకృష్ణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

 నేను ఎలాంటి తప్పు చేయలేదు

నేను ఎలాంటి తప్పు చేయలేదు

తాను ఎలాంటి తప్పు చేయలేదని రామకృష్ణా రెడ్డి చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌ల అవినీతిపై తాను పోరాటం చేశానని, సాక్ష్యాధారాలతో సహా నిరూపించానని అందుకే తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పటికీ ఏసీబీ కేసులు అంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓటుకు నోటు కేసులో నోటీసులు ఇప్పించాననే

ఓటుకు నోటు కేసులో నోటీసులు ఇప్పించాననే

ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు నుంచి నోటీసులు ఇప్పించినందుకే తనను వేధిస్తున్నారని రామకృష్ణా రెడ్డి అన్నారు. అది నచ్చక తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసు మాఫీ కోసం 29సార్లు ఢిల్లీ వెళ్లారన్నారు. నేను ఎమ్మెల్యే అయ్యాక నా ఇల్లు, పొలాలు అమ్ముకున్నారని చెప్పారు. భయపెట్టి, బెదిరించిన ఇంట్లో చంద్రబాబు ఉంటున్నారన్నారు. ఏసీపీ డీజీ ఠాకూర్ ఏవిధంగా ఐపీఎస్ అయ్యారో తెలియదన్నారు. ఠాకూర్‌కు ప్రమోషన్ కావాలంటే చంద్రబాబు ఇంట్లో అంట్లు తోముకోవాలన్నారు. కేవలం తాను సాక్షిగా మాత్రం ఇక్కడ, ఇప్పుడు హాజరయ్యానని చెప్పారు. దుర్గాప్రసాద్ నుంచి భూములు కొన్నది వాస్తవమే అయినా ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.

డీఎస్పీ కేసులో ఏసీబీ ముందుకు

డీఎస్పీ కేసులో ఏసీబీ ముందుకు

కాగా, ఓ డిఎస్పీ బినామీ ఆస్తుల కేసులో వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఎసిబి ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో రెండుసార్లు అనారోగ్యం కారణంగా విచారణకు గైర్హాజరైన అతను ఇప్పుడు ఎసిబి ముందుకు వచ్చారు. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబికి పట్టుబడ్డ గుంటూరు డీఎస్పీ దుర్గాప్రసాద్‌కి చెందిన అక్రమాస్తుల్లో రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల పేర్లను ఎసిబి గుర్తించింది. దీనిపై విచారణకు రావాల్సిందిగా ఎసిబి ఆళ్లకు నోటీసులు జారీ చేసింది. ఆరోగ్యం బాగాలేదనే కారణంతో రెండుసార్లు తన తరపున న్యాయవాదులను పంపించారు. మూడో సారి ఆయన స్వయంగా హాజరయ్యారు.

English summary
Mangalagiri MLA Alla Rama Krishna Reddy Slams Andhra Pradesh Chief Minister Nara Chandrababu Over ACB Cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X