• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన్సాన్ వివాదంపై సంచైత సంచలనం.. తండ్రి చితి ఆరకముందే.. ఆ ఇద్దరూ కలిసి చేశారంటూ..

|

విజయనగరం జిల్లా కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత 'మహారాజా అలోక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మన్సాన్) ట్రస్ట్'పై నెలకొన్న వివాదం మరో మలుపుతిరిగింది. చైర్ పర్సన్ గా సంచైత గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రస్టు భూముల్ని ఎడాపెడా అమ్మేస్తూ, అసలు ఆశయాన్ని తుంగలో తొక్కుతున్నారంటూ ఆమె బాబాయి, మాజీ చైర్మన్ అశోకగజపతి రాజు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సైతం జగన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు.

మళ్లీ మాటల యుద్ధం..

మళ్లీ మాటల యుద్ధం..


మన్సాన్ ట్రస్టు భూముల అమ్మకం వ్యవహారంపై మాజీ చైర్మన్ అశోక్ గజపతి తాజాగా మరోసారి మీడియా ముందుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై, చైర్ పర్సన్ సంచైతపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన.. ట్రస్టు ఆశయాలను కాపాడుకునేందుకు ఆందోళన చేపడతానని హెచ్చరించారు. అశోక్ గజపతి ఆవేదన తాలూకు వీడియోను షేర్ చేసిన చంద్రబాబు.. ప్రజలంతా జగన్, సంచైతల కుట్రను అర్థం చేసుకుని, అశోక్ కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బుధవారం బాబు ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే సంచైత సంచలన లేఖతో ఇద్దరిపై విరుచుకుపడ్డారు.

బాబు ఏమన్నారంటే..

బాబు ఏమన్నారంటే..

‘‘మాన్సాస్ ట్రస్ట్ అన్నది ఒక ఉన్నతమైన లక్ష్యాలతో పూసపాటి వంశీయులు స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కింద 105 దేవాలయాలతో పాటు, ఎన్నో విద్యాలయాలు ఉన్నాయి. సంస్థకున్న పవిత్ర ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంతో సహా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంస్థ విషయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటిది రూ.1 లక్షా 30 వేల కోట్లకు పైగా విలువజేసే ట్రస్ట్ భూముల మీద కన్నేసి, కాజేయడానికి వైసీపీ పెద్దలు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తండ్రి ఆశయాలను బతికించుకోవటానికి అశోక్ జగపతిరాజు తపన పడుతున్నారు. ఆయనకు అందరూ అండగా నిలవాలి. ఒక పవిత్ర సంకల్పాన్ని బతికించాలి''అని చంద్రబాబు అభ్యర్థించారు.

తండ్రి చితి ఆరక ముందే..

తండ్రి చితి ఆరక ముందే..

చంద్రబాబు బహిరంగ ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంచైత.. బాబాయి అశోక్ గజపతిరాజు గతంలో చేసిన తప్పులనూ ప్రస్తావిస్తూ ఘాటుగా బదులిచ్చారు. ‘‘ఆనందగజపతిరాజుగారి పెద్దబిడ్డగా, ఆయన వారసురాలిగా మాన్సాస్‌ బాధ్యతలను చేపట్టానన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలి. మా తండ్రి చితి ఆరకముందే మీరు, మా బాబాయ్‌ అశోక్‌గజపతిరాజుకు అనుకూలంగా జీవో జారీచేశారు''అని సంచైత ఫైరయ్యారు.

అశోక్ అక్రమాలివి..

అశోక్ అక్రమాలివి..

మన్సాన్ ట్రస్టు చైర్మన్ గా అశోక్‌ గజపతిరాజు పదవీకాలంలో అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుని, ట్రస్టును ఆర్థికంగా నష్టపోయేలా చేశారని, ఆయన హయాంలో విద్యాసంస్థల్లో నాణ్యత దారుణంగా పడిపోయిందని, ట్రస్టు భూముల్ని ఇతరులు కాజేసినా.. ఆ కేసుల్ని వాదించడానికి కనీసం లాయర్‌ను కూడా నియమించలేదని, విశాఖ అడిషనల్‌ జిల్లా జడ్జి ఇచ్చిన తీర్పు అందుకొక ఉదాహరణ అని సంచైత పేర్కొన్నారు.

  భారత్ చేతిలో హతమైన పాక్ ఉగ్రవాదులు!
  ధ్వంసం చేసింది మీరే..

  ధ్వంసం చేసింది మీరే..

  చంద్రబాబు అండతో అశోక్ గజపతిరాజు హయంలో మాన్సాస్‌ లా కాలేజీ క్యాంపస్‌ను ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు ఉచితంగా కట్టబెబెట్టి, విద్యార్థులను షెడ్డుల్లోకి నెట్టేశారని, చివరకు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ భారీ కుంబకోణంలో ఇరుక్కోవడం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైందని సంచైత గుర్తుచేశారు. ‘‘చంద్రబాబు తన సహచరుణ్ని పొగిడేముందు ఆయన(అశోక్).. మా తాతగారు, మా తండ్రిగారి వారసత్వాన్ని ఏ విధంగా ధ్వంసంచేశారో తెలుసుకోవాలి. వాస్తవం ఏంటంటే.. ఇవన్నీ మీకు తెలిసి, మీ ఇద్దరూ కలిసి చేసినవే అని ప్రజలు చెప్తున్నారు''అని సంచైత కుండబద్దలుకొట్టారు.

  English summary
  MANSAS Trust chairperson Sanchaita Gajapathi Raju on wednesday denied allegations on land seiling and slams tdp chief chandrababu and former chairman ashok Gajapathi Raju for making false propaganda.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X