వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు జిల్లాలో జల్లికట్టు, ఎద్దులతో యువత ఢీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల జల్లికట్టు (పశువుల పందాలు) నిర్వహించారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, భీమవరం, బి.కొంగరవారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం జల్లికట్టు నిర్వహించారు.

సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామదేవతల ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు జరిగాయి. కోడెగిత్తల కొమ్ములకు కానుకలు కట్టి డప్పు వాయిద్యాలతో ఉరకలెత్తించారు.

జల్లికట్టు

జల్లికట్టు

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల జల్లికట్టు (పశువుల పందాలు) నిర్వహించారు.

 జల్లికట్టు

జల్లికట్టు

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట, పుల్లయ్యగారిపల్లి, భీమవరం, బి.కొంగరవారిపల్లి తదితర గ్రామాల్లో శనివారం జల్లికట్టు నిర్వహించారు.

జల్లికట్టు

జల్లికట్టు

సంక్రాంతిని పురస్కరించుకుని గ్రామదేవతల ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలు జరిగాయి. కోడెగిత్తల కొమ్ములకు కానుకలు కట్టి డప్పు వాయిద్యాలతో ఉరకలెత్తించారు.

జల్లికట్టు

జల్లికట్టు

వీధి చివర్లో వేచి ఉన్న యువత కోడెగిత్తలను ఒడిసి పట్టుకుని వాటి కొమ్ములకున్న కానుకలను చేజిక్కించుకున్నారు.

జల్లికట్టు

జల్లికట్టు


కొన్ని కోడె గిత్తల పౌరుషం ముందు యువత చేతులెత్తేశారు. ఈ ఉత్సవాలను తిలకించడానికి జిల్లా నలుదిక్కుల నుంచి జనాలు వేలాదిగా తరలిరావడంతో రంగంపేట కిక్కిరిసి పోయింది.

జల్లికట్టు

జల్లికట్టు

ఐరాల మండలం ఇరువారం పల్లె పంచాయతీ కలికిరిపల్లెలోనూ జల్లికట్టు నిర్వహించారు. జల్లికట్టును సుప్రీం కోర్టు బ్యాన్ చేసినప్పటికీ... కొనసాగడం గమనార్హం.

జల్లికట్టు

జల్లికట్టు

కాగా, ఏపీలో పశువుల పండుగ జరుపుకున్నారని, పశువుల పండుగ అంటే జల్లికట్టు కాదని, పశువులను అందంగా ముస్తాబు చేశారని కొందరు చెబుతున్నారు. అయితే, జల్లికట్టు సందర్భంగా పశువుల పందాలు నిర్వహించడం కనిపించింది.

 జల్లికట్టు

జల్లికట్టు

రామచంద్రాపురం మండలంలోని బొప్పరాజుపల్లి, నూతుగుంటపల్లి, అనుప్పల్లి, వేపకుప్పం గ్రామాల యువతతోపాటు, గ్రామస్థులు పశువుల కొమ్ములకు కట్టిన ప్రోత్సాహక బహుమతులను కైవసం చేసుకున్నారు. పందేల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.

 జల్లికట్టు

జల్లికట్టు

యర్రావారిపాళెం మండలంలో శనివారం పశువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. సాయంత్రం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు వచ్చారని తెలిసి ప్రజలు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

 జల్లికట్టు

జల్లికట్టు

చిత్తూరు జిల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. సంక్రాంతి పండుగను చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు నారావారిపల్లెలో జరుపుకున్నారు.

English summary
Many Andhra Pradesh villages defy SC, hold Jallikattu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X