కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు హామీ: మంత్రిగా అఖిలప్రియ ముందు ఇవీ.. సొంత ఇలాకాలోను

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు పర్యాటక, తెలుగు భాషా, సంస్కృతి శాఖలను అప్పగించారు. తల్లిదండ్రుల మృతి అనంతరం ఆమెపై ఆళ్లగడ్డ, నంద్యాల బాధ్యతలు పడ

|
Google Oneindia TeluguNews

అమరావతి: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు పర్యాటక, తెలుగు భాషా, సంస్కృతి శాఖలను అప్పగించారు. తల్లిదండ్రుల మృతి అనంతరం ఆమెపై ఆళ్లగడ్డ, నంద్యాల బాధ్యతలు పడ్డాయి. ఇప్పుడు మంత్రి కావడంతో చిన్న వయస్సులోనే మరిన్ని బాధ్యతలు వచ్చిపడ్డాయి.

పర్యాటక మంత్రిగా ఆమె ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. శ్రీశైలం, అహోబిలం, యాగంటి, మహానంది, మంత్రాలయం, బెలూం గుహలు.. ఇలా జిల్లాలో పర్యాటక క్షేత్రాలకు కొదవ లేదు. ఈ ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు.

<strong>అఖిలప్రియ.. చిన్న వయస్సులో ఎన్నో పెద్ద సవాళ్లు, ఆయనదే బాధ్యత!</strong>అఖిలప్రియ.. చిన్న వయస్సులో ఎన్నో పెద్ద సవాళ్లు, ఆయనదే బాధ్యత!

Many challenges before Akhila Priya as Tourism minister

టూరిజం శాఖ మంత్రి అఖిల ప్రియ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఎకో టూరిజమ్‌, మైస్‌, టూరిజమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తదితర వాటికి దాదాపు రూ.70 కోట్లతో అధికారులు ఒప్పంద పత్రాలు సిద్ధం చేశారు. వీటిని అమలు చేయాల్సిన అవసరం ఉంది.

ప్రయివేటు భాగస్వామ్యంతో అహోబిలంలో రూ.10 కోట్లతో రోప్ వే కోసం ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. అదే నియోజకవర్గానికి చెందిన టూరిజం మంత్రి అఖిల ఈ పనులు చేపట్టాలని కోరుతున్నారు.

ఎకో టూరిజమ్‌లో భాగంగా బెలూం గుహలను రూ.10 కోట్లతో అభివృద్ధితో పాటు మినీ కన్వెన్షన్‌ జిల్లాకు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు రాబట్టాలి.
ఓర్వకల్లు రాక్ గార్డెన్‌లో రూ.40 కోట్లతో ఎగ్జిబిషన్‌, హోటల్‌, పార్కుల అభివృద్ధి, బోటింగ్‌ ఏర్పాటు ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు.

కొండారెడ్డి బురుజుకు సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టమ్‌, గోల్‌గుమ్మజ్‌లో పార్కు అభివృద్ధి తదిర వాటికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి మోక్షం లభించాలని చెబుతున్నారు. ప్రధానంగా టూరిజం సర్క్యూట్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.

English summary
Many challenges before Allagadda MLA Akhila Priya as Tourism minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X