వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీలోకి కాంగ్రెస్ నేతల క్యూ, ప్రతిభ అసంతృప్తి: ఊరుకోం.. కాంగ్రెస్‌తో దోస్తీపై అయ్యన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి, మాజీ చీఫ్ విప్ కొండ్రు మురళి అధికార పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు నేతలు టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

జగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుకజగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుక

చంద్రబాబుతో ఉగ్రనరసింహా రెడ్డి భేటీ

చంద్రబాబుతో ఉగ్రనరసింహా రెడ్డి భేటీ

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఉగ్రనరసింహా రెడ్డి గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. టీడీపీలో చేరే అంశంపై మంతనాలు జరిపారు. స్థానిక కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుతోను టిడిపి అధినాయకత్వం చర్చించింది. పార్టీలో కొత్త చేరికలతో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని భావిస్తోంది.

కళాతో కొండ్రు మురళి

కళాతో కొండ్రు మురళి

మరోవైపు, కొండ్రు మురళి ఇప్పటికే ఏపీ పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావుతో భేటీ అయ్యారు. ఆయన రాజాం టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే కొండ్రు మురళి రాకను మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వ్యతిరేకిస్తున్నారు. వీరి భాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు నడిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ప్రతిభా భారతి ఆవేదన

ప్రతిభా భారతి ఆవేదన

కొండ్రు మురళిని పార్టీలోకి తీసుకొని రావడం సరికాదని, ఇందుకు తాను అంగీకరించేది లేదని ప్రతిభా భారతి పార్టీ అధిష్టానానికి చెప్పారని తెలుస్తోంది. అయితే ఆమెను బుజ్జగించేందుకు అధిష్టానం చర్యలు చేపట్టారు. ఆమెను బుజ్జగించి కొండ్రును తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ఒప్పుకునేది లేదు

కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ఒప్పుకునేది లేదు

కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపితే తాను ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకునేది లేదని ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు గురువారం అన్నారు. కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకు తెలుగుదేశం పార్టీ పుట్టిందని చెప్పారు. నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని లీజుకు తీసుకున్న స్థలంలో నిర్మాణాలు చేపడితే ఊరుకునేది లేదన్నారు.

English summary
Many Congress leaders ready to join Telugudesam Party. Kanigiri former MLA Ugra Narasimha Reddy met AP CM Nara Chandrababu Naidu on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X