వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీసీల‌కు 50 శాతం ప‌ద‌వులు: పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రిమండ‌లి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌కు ఆమోద ముద్ర వేసింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించింది. రజక, నాయి బ్రాహ్మణ, టైలర్లకు ఆర్థిక సహాయంగా ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాతిపాదనకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది.2018 నాటి ఏపీఈడీబీ చట్టం తొలగింపుకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

50 శాతం ప‌ద‌వులు..ఆర్దిక సాయం..
ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ ఇచ్చిన కీల‌క హామీల‌కు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అందులో భాగంగా..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అదే విధంగా నామినేషన్‌ పద్దతి లో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకే దక్కే విధంగా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని మంత్రిమండలి నిర్ణయించింది.ఈ విప్లవాత్మక చట్టానికి ప్రభు త్వం ఈ సమావేశాల్లోనే ఆమోదించే లా చేస్తామ‌ని మంత్రులు చెబుతున్నారు. అదే విధంగా మ‌రో కీల‌క హామీ అయిన రజక, నాయి బ్రాహ్మణ, టైలర్లకు ఆర్థిక సహాయంగా ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాతిపాదనకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. మ‌రో ముఖ్య‌మైన నిర్ణ‌యానికి కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది. పరిశ్రమల నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశాల కోసం జీవనోపాధి కల్పించే విధంగా చట్టం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

Many election assurances and key decisions approved by AP Cabinet. Decided to give 50 percent nominated posts for bcs.

వైఎస్సార్‌ నవోదయం..
సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు ఊరటగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం ప్రకటించింది. 'వైఎస్సార్‌ నవోదయం' పథకం కింద కొత్త పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం టున్న ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేలా ఈ స్కీంను రూపొందించారు. జిల్లాల వారీగా 86వేల ఎంఎస్‌ఎంఈల ఖాతాల గుర్తించనున్నారు. రూ.4వేల కోట్ల రుణాలు ఒన్‌టైం రీస్ట్రక్చర్‌ ఎన్‌పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా అవకాశం కల్పించనున్నారు. ఎంఎస్‌ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం ఉండే విధంగా దీనిని రూపొందించనున్నారు. రానున్న 9 నెలల వ్యవధిలోనే ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ ప్రభుత్వం 2018లో రూపొందించిన ఏపీఈడీబీ చట్టాన్ని తొలగించాలని కేబినెట్‌ నిర్ణయించింది. దాని స్థానంలో కొత్తగా ఆంధ్ర ప్రదేశ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యాక్ట్‌ను రూపొందిస్తూ.. 2019 ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.

English summary
Many election assurances and key decisions approved by AP Cabinet. Govt decided to give 50 percent nominated posts and also 75 percent jobs for local candidates in local industries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X