వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంశీకి ఎన్ని చిక్కులో, ఇంటా-బయటా నలిగిపోతున్నారు, 'రాజీనామాకు కట్టుబడాలి'

టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటా, బయటా ఒత్తిళ్లతో నలిగిపోయారని, అధికారుల వద్ద అవమానాలకు గురయ్యారని అంటున్నారు. ఆయనకు మూడేళ్లుగా డెల్టా తలనొప్పులు ఉన్నాయని చెబుతున్నారు. భూసేకరణ విషయంలో రైతుల ఆందో

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటా, బయటా ఒత్తిళ్లతో నలిగిపోయారని, అధికారుల వద్ద అవమానాలకు గురయ్యారని అంటున్నారు. ఆయనకు మూడేళ్లుగా డెల్టా తలనొప్పులు ఉన్నాయని చెబుతున్నారు. భూసేకరణ విషయంలో రైతుల ఆందోళన, రైతుల ఇబ్బంది, అధికారుల తీరుతో నలిగిపోయారంటున్నారు.

Recommended Video

TDP MLA Vallabhaneni Vamsi Resigns?

డెల్టా షుగర్స్‌పై సీఎంవో అధికారి తీరుతో బుధవారం కంటతడి పెట్టుకున్నారు. వంశీ. అంతకుముందు రోజు మరో అధికారి ఆయనను దాదాపు రెండు గంటల పాటు వెయిట్ చేయించారు. పోలవరం కడికాల్వ ద్వారా రైతులకు మోటార్ల ద్వారా నీటి పంపింగ్ విషయంలోను చుక్కెదురయింది. ఈ విషయంలో మంత్రి లోకేష్ కల్పించుకున్నారు.

సతమతమైన వంశీ

సతమతమైన వంశీ

వల్లభనేని వంశీకి ఇలా వరుస అవమానాలు ఎదురవుతున్నాయని, దీంతో అతను రాజీనామా చేయాలని భావించారని అంటున్నారు. అభివృద్ధి పనుల కోసం గన్నవరం నియోజకవర్గంలో భూసేకరణలు, రైతుల ఆందోళనలతో వంశీ సతమతమయ్యారు. అభివృద్ధి కోసం ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించలేక, రైతుల ఇబ్బందులు చూడలేక ఇబ్బందులు పడ్డారు.

రైతులకు అండగా

రైతులకు అండగా

తాజాగా, డెల్టా మసివేత విషయంలో రైతులకు అండగా నిలిచారు వంశీ. ఆయనకు కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైంది. తనను వేచిచూసేలా చేయడం, నిర్లక్ష్యం వహించడంతో వంశీ కంటతడి పెట్టారు. రాజీనామా కూడా చేయాలని నిర్ణయించుకోవడం, లోకేష్ జోక్యంతో సర్దుకుపోవడం గమనార్హం.

ఒప్పించి, మెప్పించిన వంశీ

ఒప్పించి, మెప్పించిన వంశీ

గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూమి సేకరించే విషయంలో జిల్లా యంత్రాంగం రైతులతో వ్యవహరించిన తీరుతో కూడా వంశీ ఇబ్బందులు పడ్డారని అంటున్నారు. పలు సందర్భాల్లో రైతులతో వంశీనే మాట్లాడి, వారిని ఒప్పించి, సీఎం చంద్రబాబు వద్దకు తీసుకు వచ్చి, ఆయన హామీతో భూసేకరణ వంటి వాటిని చేశారు.

గన్‌మెన్లను సరెండర్ చేశారు

గన్‌మెన్లను సరెండర్ చేశారు

ఇన్నోవేటివ్ ఇండస్ట్రియల్ కారిడార్, మెగా ఫుడ్ పార్కు విషయంలోను వంశీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్నర్ రింగు రోడ్డును జాతీయ రహదారికి అనుసంధానం చేసే విషయంలో అయితే అధికారుల తీరుకు గాను వంశీ తన గన్‌మెన్లను సరెండర్ చేశారు. తర్వాత సమస్య పరిష్కారమైంది.

అన్నింటిని ఎదుర్కొన్న వంశీకి కంటతడి పెట్టించింది

అన్నింటిని ఎదుర్కొన్న వంశీకి కంటతడి పెట్టించింది

వరుస భూసేకరణలు జరిగితే ఏ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధికైనా ఇబ్బందులు ఎదురవుతాయి. పలు సందర్భాల్లో వంశీ రైతులను సీఎం వద్దకు తీసుకు వెళ్ల హామీ ఇప్పించారు. ఎమ్మెల్యేగా తాను ఏమిటో నిరూపించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డెల్టా షుగర్స్ అంశం ఆయనతో కంటతడి పెట్టించింది.

వంశీ రాజీనామాకు కట్టుబడి ఉండాలి

వంశీ రాజీనామాకు కట్టుబడి ఉండాలి

ఇదిలా ఉండగా వంశీ తన రాజీనామాకు కట్టుబడి ఉండాలని సీపీఎం నేత రఘు కోరారు. ఫ్యాక్టరీ విషయంపై మాట్లాడటానికి సీఎంవోకు వెళ్లిన వంశీపట్ల అధికారులు అమర్యాదగా ప్రవర్తించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. వంశీ చిత్తశుద్ధితో ప్రయత్నించి డెల్టా షుగర్స్‌ను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. వంశీ తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, ప్రభుత్వ షుగర్ ఫ్యాక్టరీ కొనసాగించే వరకు వంశీ రాజీనామాకు కట్టుబడి ఉండాలన్నారు.

English summary
Vallabhaneni Vamsi on Wednesday wanted to resign for his MLA post due to CMO officers rude behaviour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X