అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి వివిఎస్ లక్ష్మణ్, రాందేవ్: మనవడితో బాబు బిజీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాతా అమృతంగమయిలు శంకుస్థాపనకు హాజరు కానున్నారు. 245 మంది విదేశీ ప్రముఖులకు ఆహ్వానం అందింది.

కాగా, కేంద్ర రాజధాని ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ముహూర్తానికి మూడు రోజులే గడువు ఉండటంతో ఉన్నతాధికారులు తమ సిబ్బందిచే రేయింబవళ్లు పని చేయిస్తున్నారు. 22న ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన కార్యక్రమం లక్షలమంది ప్రజల సమక్షంలో వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.

ఇప్పటికే దేశ ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు, జపాన్, సింగపూర్ ప్రతినిధులు ఆశీనులయ్యే ప్రధాన వేదిక పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంది. 1.5లక్షల మంది ప్రజలు కూర్చునేందుకు అవసరమైన గ్యాలరీలూ సిద్ధమయ్యాయి.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

పక్కనేవున్న ఉప వేదికలు అరవై శాతం పనులు పుర్తయినట్లు అధికారులు వెల్లడించారు. 20నుంచి యాగం వేద పండితులు ప్రారంభించనున్న దృష్ట్యా అధికారులు యాగశాలను సిద్ధం చేశారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

అమరావతి సంకల్పజ్యోతి స్థూపం ఆదివారం వరకు 50 శాతం పూర్తయింది. ఏర్పాట్లను సమీక్షించేందుకు రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, కిమిడి మృణాళిని, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జెసి చెరుకూరి శ్రీధర్ తదితరులు ఆదివారం చేరుకున్నారు.

అమరావతి ఏర్పాట్లు

అమరావతి ఏర్పాట్లు

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి సిఎం చంద్రబాబు చేస్తున్న కృషికి ప్రజల మద్దతు సంపూర్ణంగా లభిస్తుందన్నారు. రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33వేల ఎకరాలు అందించడం కార్యక్రమ విజయానికి ముఖ్య కారణమన్నారు. రైతులను సన్మానించాలనే ముఖ్యమంత్రి ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు స్వయంగా మంత్రులు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తూ ఆహ్వానపత్రికలు అందిస్తున్నారన్నారు.

చంద్రబాబు కుటుంబం

చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

చంద్రబాబు కుటుంబం

చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్.

చంద్రబాబు కుటుంబం

చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో మనవడితో బాలకృష్ణ.

బాబు ఒళ్లో మనవడు

బాబు ఒళ్లో మనవడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసన సందర్భంగా మనవడు దేవాన్ష్‌తో చంద్రబాబు.

లోకేష్ ఒళ్లో కొడుకు

లోకేష్ ఒళ్లో కొడుకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేష్ ఒళ్లో దేవాన్ష్.

బ్రాహ్మణి ఒళ్లో కొడుకు

బ్రాహ్మణి ఒళ్లో కొడుకు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రాహ్మణి ఒళ్లో దేవాన్ష్.

అతిథి గృహంలో చంద్రబాబు

అతిథి గృహంలో చంద్రబాబు

తిరుమలలో అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్యం.

మన నీరు మన మట్టి

మన నీరు మన మట్టి

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిలో ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మిస్తానని సిఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం 10.30కు చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. ఉదయం 11.15కు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా కుటుంబీకులతో కలసి ఆలయం మహాద్వారం వద్దకు చేరుకున్నారు.

మన నీరు మన మట్టి

మన నీరు మన మట్టి

ఈసందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఇస్తికపాల్‌తో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. పది నిమిషాలపాటు స్వామివారిని దర్శించుకున్న సిఎం, ఆయన కుటుంబీకులు రంగనాయక మండపానికి చేరుకున్నారు. అక్కడవారికి పండితులు వేదాశీర్వచనం అందించారు. టిటిడి ఛైర్మన్, ఇఒలు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

మన నీరు మన మట్టి

మన నీరు మన మట్టి

ఈ క్రమంలోనే చంద్రబాబు మనుమడు దేవాన్షకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజధాని శంకుస్థాపనకు టిటిడి యాజమాన్యం ఇచ్చిన నవరత్నాలను, మన మట్టి- మన నీరు కార్యక్రమంలో భాగంగా టిటిడి అధికారులు శేషాచల కొండల్లోని 7 తీర్థాలు, 7 కొండల నుంచి సేకరించి రంగనాయక మండపంలో ఉంచిన మట్టిని, పవిత్ర జలాలను తలపై ఉంచుకుని వైభవోత్సవ మండపం వద్ద రాజధానికి తరలించడానికి సిద్ధంగా ఉంచిన కల్యాణ రథంలోకి చేర్చిన తర్వాత పూజలు నిర్వహించారు.

మన నీరు మన మట్టి

మన నీరు మన మట్టి

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తయ్యేలా స్వామివారి ఆశీస్సులు పొందడానికి తాను తిరుమలకు వచ్చానన్నారు. ఇందులో భాగంగానే ఏడుకొండల నుంచి సేకరించిన మట్టి, పవిత్రజలాలు, నవరత్నాలను తిరుమలేశుని పాదాల చెంత ఉంచి పూజలు చేయించామన్నారు.

మన నీరు మన మట్టి

మన నీరు మన మట్టి

ముఖ్యంగా గరుడోత్సవం రోజున తాను తిరుమలకు వచ్చి పవిత్ర జలాలు, మట్టిని తీసుకెళ్లడం తన భాగ్యంగా భావిస్తున్నానన్నారు. ఇందులోభాగంగా శంకుస్థాపన ఆహ్వాన పత్రికలను స్వామి పాదాల చెంత ఉంచి, ఒక పత్రికను స్వామివారి హుండీలో సమర్పించానన్నారు. తెలుగు ప్రజలు మెచ్చుకునేలా ప్రపంచస్థాయిలో సకల సౌకర్యాలతో రాజధాని నిర్మాణం స్వామివారి ఆశీస్సులతో నిర్విఘ్నంగా సాగుతుందన్న విశ్వాసం తనకు పరిపూర్ణంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం కోసం దేశంలోని పుణ్యనదులు, క్షేత్రాల నుంచి మట్టి, జలాలు సేకరించామన్నారు. అంతేకాకుండా దేశంలో ఎందరో మహానుభావులు జన్మించారని, వారు నడయాడిన నేలనుంచి మట్టిని కూడా సేకరించి రాజధాని నిర్మాణం చేపడుతున్నామన్నారు. దీంతో నూతన రాజధాని మరింత శక్తివంతంగా మారుతుందన్నారు.

English summary
Many VIPs Amaravati foundation on October 22nd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X